WhatsApp: మెటా ప్లాట్‌ఫామ్స్‌లో ఏఐ.. వాట్సప్‌లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!

WhatsApp: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్‌ అవుతుంది.

Published : 19 Apr 2024 16:03 IST

WhatsApp | ఇంటర్నెట్‌డెస్క్‌: ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రేసులో అడుగుపెట్టింది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికలకు తన మెటా ఏఐని ఇంటిగ్రేట్‌ చేసింది. లాలామా 3 లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ ఆధారంగా పని చేస్తుంది. దీంతో చాట్‌జీపీటీ తరహాలో మెటా ఏఐ చాట్‌బాట్‌ ఏ ప్రశ్నకైనా చిటికెలో సమాధానం రాబట్టొచ్చు. అంతేకాదు వాట్సప్‌లో ఇకపై ఏఐ సాయంతో రియల్‌టైమ్‌ ఇమేజులను రూపొందించొచ్చని మెటా చెబుతోంది.

‘‘మెటా ఏఐ సాయంతో టెక్ట్స్‌ అందిస్తే చాలు సులువుగా ఇమేజ్‌ జనరేట్‌ చేయొచ్చు. క్వాలిటీ మిస్‌ కాకుండా ఫొటోలను యానిమేట్‌ చేయొచ్చు. meta.ai సాయంతో వెబ్‌లో కూడా ఈ సేవలు వినియోగించుకోవచ్చు’’ అని జుకర్‌ బర్గ్‌ తాజాగా పేర్కొన్నారు. మెటా వెల్లడించిన దానిప్రకారం.. మనం ఊహించుకున్న చిత్రాన్ని టెక్ట్స్‌ రూపంలో ఏఐ అసిస్టెంట్‌కు తెలిపితే చాలు అదే ఇమేజ్‌ను జనరేట్‌ చేసేస్తుందన్నమాట. GIF మార్చే ఫీచర్‌ కూడా ఇందులో ఉందని తెలిపింది. ప్రాంప్ట్‌లు, సూచనలను అందిస్తుందని మెటా చెబుతోంది. 

మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?

మరోవైపు తమ వేదికలపై అందిస్తున్న మెటా ఏఐని మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నట్లు మెటా తెలిపింది. మన దేశంలోనూ కొందరు యూజర్లకు ఈ ఫీచర్‌ దర్శనమిస్తోంది. వాట్సప్‌ చాట్‌ మెనూలో వివిధ రంగులతో కూడిన వృత్తాకారంలో మెటా ఏఐ ఐకాన్‌ ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేస్తే ‘ఆస్క్‌ మెటా ఏఐ ఎనీథింగ్‌’ అంటూ ఓ పాప్‌అప్‌ ఓపెన్‌ అవుతుంది. కంటిన్యూపై క్లిక్‌ చేస్తే మెటా ఏఐతో చాట్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. ఈ చాట్‌ మెనూలో వివిధ అంశాలకు సంబంధించిన చాట్‌జీపీటీ తరహాలో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. రానున్న రోజుల్లో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు