Tecno: 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్‌

Tecno: టెక్నో కెమన్‌ సిరీస్‌లో రెండు కొత్త మొబైల్స్‌ను లాంచ్‌ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..

Published : 19 May 2024 00:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్నో మొబైల్స్‌ కెమన్‌ సిరీస్‌ (Tecno Camon Series)లో రెండు కొత్త ఫోన్లను భారత్‌ మార్కెట్లోకి తీసుకొచ్చింది. టెక్నో కెమన్‌ 30 5జీ (Tecno Camon 30 5G), కెమన్‌ 30 ప్రీమియర్‌ 5జీ (Camon 30 Premier 5G) పేరిట వీటిని లాంచ్‌ చేసింది. 50ఎంపీ సెల్ఫీ కెమెరా,  5,000mAh బ్యాటరీతో వస్తోన్న ఈ మొబైల్‌ ఇతర ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..!

టెక్నో కెమన్‌ 30 5జీ (Tecno Camon 30 5G)

కెమన్‌ విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేటు కలిగిఉంటుంది. ఇందులో 6nm డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. వెనకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ డెప్త్‌ కెమెరా అమర్చారు. ఈ మొబైల్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది.

‘3 ఇడియట్స్‌’ సీన్‌తో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు సుందర్‌ పిచాయ్‌ సలహా..

కెమన్‌ 30 ప్రీమియర్‌ 5జీ (Camon 30 Premier 5G)

ఈ ఫోన్‌ 6.77 అంగుళాల 1.5కె ఎల్‌టీపీఓ అమోలెడ్‌ స్క్రీన్‌, 120Hz స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. ఇందులో 4nm డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌ అమర్చారు. కెమెరాల విషయానికొస్తే ఇందులో.. 50ఎంపీ సోనీ IMX890 OIS కెమెరా, 50ఎంపీ టెలిఫొటో లెన్స్‌, 50ఎంపీ వైడ్‌ యాంగిల్ కెమెరాను అమర్చారు. ఈ మొబైల్‌ను కేవలం ఒక వేరియంట్‌లోనే అందుబాటులోకి తెచ్చారు. 12జీబీ+512జీబీ వేరియంట్‌ ధర రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది.

డ్యూయల్‌ సిమ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్లు ఆండ్రాయిడ్‌ 14 ఆధారంగా పనిచేస్తాయి. దుమ్ము, నీరు చేరకుండా IP53 రేటింగ్‌ను కలిగిఉంటాయి. 5,000mAh బ్యాటరీ, 70W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయాన్ని కలిగిఉంటాయి. రెండు ఫోన్లు 50ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగిఉన్నాయి. వైఫై, బ్లూటూత్‌, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. మే23 నుంచి రెండు ఫోన్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ప్రారంభ ఆఫర్‌ కింద రూ.3 వేలు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చని కంపెనీ చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు