Tecno Spark Go: ₹6,699కే టెక్నో కొత్త మొబైల్‌.. 5,000mAh బ్యాటరీ, 13ఎంపీ కెమెరా

Tecno Spark Go 2024: చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ టెక్నో.. స్పార్క్‌ గో 2024 పేరుతో కొత్త మొబైల్‌ని భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.

Updated : 05 Dec 2023 16:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా మొబైల్‌ తయారీ కంపెనీ టెక్నో (Tecno Mobiles) కొత్త స్మార్ట్‌ఫోన్‌ని భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఈ ఏడాదిలోనే టెక్నో స్పార్క్‌ గో 2023ని లాంచ్‌ చేసిన కంపెనీ ఇప్పుడు అదే సిరీస్‌లో మరో ఫోన్‌ను తీసుకొచ్చింది. టెక్నో స్పార్క్‌ గో 2024 (Tecno Spark Go 2024) పేరిట ఈ మొబైల్‌ని విడుదల చేసింది. 5,000mAh బ్యాటరీతో తక్కువ ధరలో లాంచ్‌ అయిన ఈ మొబైల్ ఫీచర్లపై ఓ లుక్కేయండి.

టెక్నో స్పార్క్‌ గో 2024 (Tecno Spark Go 2024) మూడు వేరింట్లలో లభిస్తుంది. 3జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.6,699గా కంపెనీ నిర్ణయించింది. అయితే 8జీబీ+64జీబీ వేరియంట్‌, 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధరల్ని ఇంకా వెల్లడించలేదు. గ్రావిటీ బ్లాక్‌, మిస్ట్రీ వైట్‌ రెండు రంగుల్లో లభిస్తుంది. డిసెంబరు 7 నుంచి వీటి విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. అమెజాన్‌తో పాటూ ఇతర రిటైల్‌ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది.

2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌: ఎస్‌అండ్‌పీ

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ మొబైల్‌ 6.56 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత హెచ్‌ఐఓఎస్‌తో పనిచేస్తుంది. పాండా స్క్రీన్‌ ప్రొటెక్షన్‌తో డిస్‌ప్లేతో దీన్ని తీసుకొచ్చారు. ఇందులో ఆక్టాకోర్‌ యూనిసోక్‌ T606 ప్రాసెసర్‌ అమర్చారు. ఫోన్‌ వెనక 13ఎంపీ ప్రధాన కెమెరా డ్యుయల్‌ ఫ్లాష్‌లైట్‌, ఏఐ లెన్స్‌ ఇచ్చారు. వీడియోకాల్స్‌, సెల్ఫీ కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000mAh బ్యాటరీ, డీటీఎస్‌ సౌండ్‌ టెక్నాలజీతో డ్యుయల్‌ స్టీరియో స్పీకర్ల సదుపాయంతో ఈ మొబైల్‌ వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని