MNP: మొబైల్‌ నంబర్‌ పోర్టింగ్‌కు కొత్త రూల్‌.. జులై 1 నుంచి అమల్లోకి

Mobile Number portability: మొబైల్‌ నంబర్ పోర్టింగ్‌కు ట్రాయ్‌ కొత్త నిబంధన తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.

Published : 18 Mar 2024 18:26 IST

Mobile Number portability | ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ నంబర్‌ మార్చకుండా వేరే నంబర్‌కు మారేందుకు వెసులుబాటు కల్పిస్తున్న మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ (MNP) విషయంలో ట్రాయ్‌ కొత్త నిబంధన తీసుకొచ్చింది. సిమ్‌ కార్డ్‌ స్వాప్‌ లేదా రీప్లేస్‌ చేసిన ఏడు రోజుల వరకు వేరే నెట్‌వర్క్‌కు మారడాన్ని నిలిపివేసింది. సిమ్‌ స్వాప్‌ మోసాలను అరికట్టేందుకు గానూ ట్రాయ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

సిమ్‌ పేరుతో జరిగే మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటికి చెక్‌ పెట్టాలంటూ టెలికాం విభాగం రాసింది. దీంతో ట్రాయ్‌ కొత్త మార్పు చేపట్టింది. ఈ కొత్త నిబంధనతో కూడిన సర్క్యులర్‌ను గత వారం జారీ చేసింది. దీని ప్రకారం.. ఎవరైనా వ్యక్తి సిమ్‌ కార్డు మార్చుకున్నా, స్వాప్‌ చేసినా వారం రోజుల వరకు వేరే నెట్‌వర్క్‌కు మారేందుకు అవసరం అయ్యే యునిక్‌ పోర్టింగ్‌ కోడ్‌ను (UPC) జారీ చేయరు. కొత్త వ్యక్తి పేరుతో అదే నంబర్‌ను తీసుకోకుండా కేటుగాళ్లను నిలువరించే ఉద్దశంతో ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ట్రాయ్‌ తెలిపింది.

ఐపీఎల్‌ సందడి.. జియో యూజర్లకు డేటా ప్యాక్‌లు

సాధారణంగా సిమ్‌ కార్డు పోతేనో లేదా పాడైతేనో సంబంధిత టెలికాం సంస్థను ఆశ్రయిస్తే.. కొత్త సిమ్‌ కార్డును జారీ చేస్తుంటాయి. వేరే నెట్‌వర్క్‌కు మారాలాంటే ప్రస్తుత మొబైల్‌ నంబర్‌ నుంచి PORT<మొబైల్‌ నంబర్‌>ను 1900కు ఎస్సెమ్మెస్‌ పంపించాల్సి ఉంటుంది. దీంతో మీకో యునిక్‌ కోడ్‌ వస్తుంది. ఇతర నెట్‌వర్క్‌కు మారేటప్పుడు ఈ నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 2009లో తొలిసారి పోర్టబిలిటీ విధానం అమల్లోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని