Jio - IPL: ఐపీఎల్‌ సందడి.. జియో యూజర్లకు డేటా ప్యాక్‌లు

Jio - IPL: ఐపీఎల్‌ వీక్షించాలనుకునేవారికి జియోలో రెండు అనువైన డేటా ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలేంటో చూద్దాం..!

Published : 18 Mar 2024 13:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్ (IPL) సందడి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానుల కోసం రిలయన్స్‌ జియో (Reliance Jio) రెండు డేటా ప్యాక్‌లను అందిస్తోంది. ఈ లీగ్‌ను వీక్షించాలనుకునేవారికి ఇవి సరిగ్గా సరిపోతాయి! రూ.667, రూ.444తో వస్తున్న ఈ ప్లాన్లు కొంతకాలంగా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. మ్యాచులను ఎంజాయ్‌ చేయాలనుకునేవారు వైఫై సదుపాయం లేకపోతే వీటిని పరిశీలించొచ్చు. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

రిలయన్స్‌ జియో (Reliance Jio) రూ.667 ప్లాన్‌ వ్యాలిడిటీ 90 రోజులు. ఇది కేవలం డేటా వోచర్‌ మాత్రమే. దీంట్లో వాయిస్‌ కాలింగ్‌, ఎసెమ్మెస్‌ వంటి ప్రయోజనాలేమీ ఉండవు. పైగా యాక్టివ్‌ బేస్‌ ప్లాన్‌ ఉంటేనే దీన్ని రీఛార్జ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 150 జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ పరిమితి ఏమీ ఉండదు. కావాలంటే మొత్తం ఒకేసారి వాడుకోవచ్చు. మరోవైపు రూ.444 ప్లాన్‌లో 100 జీబీ డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 60 రోజులు. దీనికీ బేస్‌ ప్లాన్‌ ఉండాల్సిందే.

ఫోన్‌ లేదా ట్యాబ్లెట్‌లో ఐపీఎల్‌ (IPL) చూడాలనుకునేవారు జియో సినిమా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఉచితంగానే మ్యాచులను వీక్షించొచ్చు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ అవసరం లేదు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు. జియోయేతర కస్టమర్లు సైతం యాప్‌లోకి లాగిన్‌ అయ్యి లైవ్‌ని ఎంజాయ్‌ చేయొచ్చు. పైన తెలిపిన రెండు ప్యాక్‌లతో పాటు జియోలో ఇతర డేటా ఆప్షన్లూ ఉన్నాయి. యాప్‌ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో వాటి వివరాలు తెలుసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని