Truecaller: స్కామ్‌ కాల్స్‌కు ఏఐతో చెక్‌.. ట్రూకాలర్‌ కొత్త ఫీచర్

Truecaller: ట్రూకాలర్‌ సంస్థ కొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. ఏఐ సాయంతో చేసే కాల్స్‌ను గుర్తించేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. 

Updated : 30 May 2024 14:00 IST

Truecaller | ఇంటర్నెట్‌ డెస్క్‌: గుర్తు తెలీని నంబర్‌ నుంచి ఫోన్‌.. కాల్‌ లిఫ్ట్ చేయగానే అవతలి వ్యక్తి కంగారుగా మాట్లాడుతూ.. ‘నేను ప్రమాదంలో చిక్కుకున్నా. నా ఫోన్‌ పోయింది. అత్యవసరంగా డబ్బు కావాలి’ అంటూ ప్రాణ స్నేహితుడి వాయిస్‌. ఆ మాటలు విని క్షణం కూడా ఆలోచించకుండా ఆ నంబర్‌కు డబ్బులు పంపేస్తుంటారు. వాస్తవానికి ఇదో కొత్త తరహా  స్కామ్‌. ఇటీవల కాలంలో ఏఐ సాయంతో వ్యక్తుల వాయిస్‌ను క్లోన్‌ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. మోసపోయిన విషయం బాధితులకు కూడా కొన్నిసార్లు ఆలస్యంగా తెలుస్తుంది. ఇలాంటి మోసాలకు చెక్‌ పెట్టేందుకు ట్రూకాలర్ (Truecaller) కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఏఐ స్కామ్‌ కాల్స్‌ను గుర్తించేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. 

ఏదైనా కాల్‌ వచ్చినప్పుడు ఆ వాయిస్ ఏఐ సాయంతో జనరేట్‌ చేసినదా? కాదా? అనేది కొన్ని క్షణాల్లో ట్రూకాలర్‌ ఈ ఫీచర్‌ చెప్పేస్తుంది. అందుకోసం కొన్ని క్షణాల పాటు ఆ వాయిస్‌ను రికార్డు చేసి అనలైజ్‌ చేస్తుంది. ఇందుకోసం తమ సొంత ఏఐ మోడల్‌ను వినియోగించినట్లు ట్రూకాలర్‌ తెలిపింది. సోషల్‌మీడియాలోని వీడియోలతో పాటు కొందరు వ్యక్తుల వాయిస్‌ను ఉపయోగించినట్టు ట్రూకాలర్‌ తెలిపింది.

నగదు రహిత చికిత్సపై గంటలోపే నిర్ణయం

ఏఐ స్కామ్‌ కాల్స్‌ను గుర్తిచేందుకు ట్రూకాలర్‌ను డిఫాల్ట్‌ కాలర్‌ యాప్‌గా సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై ఏదైనా అనుమానాస్పద కాల్‌ వస్తే స్టార్ట్‌ డిటెక్షన్‌పై క్లిక్‌ చేస్తే కాల్‌ను రికార్డు చేసికొన్ని క్షణాల్లో దాన్ని అనలైజ్‌ చేస్తుంది. ఫలితాన్ని నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తుంది. తొలుత అమెరికాలోని ఆండ్రాయిడ్‌ ప్రీమియం యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. రాబోయే నెలల్లో భారత్‌ సహా ఇతర మార్కెట్లకు ఈ సదుపాయం తీసుకొస్తామని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు