Twitter: సూపర్‌ యాప్‌ దిశగా ట్విటర్‌ అడుగులు.. త్వరలో వీడియో కాల్‌ ఫీచర్‌

ట్విటర్‌ (Twitter)లో యూజర్లకు వీడియో కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ట్విటర్‌ సీఈవో లిండా యాకరినో (Linda Yaccarino) తెలిపారు.

Published : 12 Aug 2023 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా యాప్‌ స్థాయి నుంచి సూపర్‌ యాప్‌గా మారేందుకు ట్విటర్‌ (ప్రస్తుతం ఎక్స్) వేగంగా అడుగులు వేస్తోంది. ఎక్స్‌గా పేరు మార్చుకున్న తర్వాత కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. త్వరలో యూజర్లకు వీడియో కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ట్విటర్‌ సీఈవో లిండా యాకరినో (Linda Yaccarino) తెలిపారు. దాంతోపాటు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు పోస్ట్‌ చేయడం, కంటెంట్‌ క్రియేటర్‌ సబ్‌స్క్రిప్షన్‌, డిజిటల్‌ చెల్లింపులు వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తామని లిండా తెలిపారు. 

మరోవైపు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలోని వస్తువులను మస్క్‌ వేలానికి ఉంచాడు. ఆంగ్ల వార్తా సంస్థ కథనాల ప్రకారం.. ట్విటర్‌ ప్రయాణాన్ని తెలిపేలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన  కాఫీ టేబుల్స్‌, భారీ పక్షి పంజరాలు, వైరల్‌గా మారిన ఆయిల్‌ పెయింటింగ్స్‌, డెస్క్‌లు, డీజే బూత్‌, మ్యూజికల్‌ పరికరాలు.. ఇలా మొత్తం 584 వస్తువులను మస్క్‌ వేలానికి ఉంచినట్లు సమాచారం. వేలంలో వస్తువుల ప్రారంభ ధర 25 డాలర్లుగా నిర్ణయించాడు. సెప్టెంబరు 12 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ వేలం ప్రక్రియ జరగనుంది. 

బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోకపోతే ఇబ్బందే.. క్రోమ్‌ యూజర్లకు కేంద్రం సూచన

ట్విటర్‌ను సూపర్‌ యాప్‌గా మార్చాలనే ఉద్దేశంతోనే ఎక్స్‌గా పేరు మార్చినట్లు మస్క్‌ తెలిపారు. ఇందులో భాగంగా చైనా వీచాట్‌ తరహాలో  సోషల్‌ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్‌, ఫుడ్ డెలివరీ, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, బ్యాంకింగ్‌, నగదు వ్యాలెట్‌లు, క్యాబ్‌ బుకింగ్‌, టికెట్‌ బుకింగ్‌ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని