అయోధ్యలో నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని మెరుగుపరిచిన టెలికాం సంస్థలు

రామమందిరం ప్రారంభోత్సవం కారణంగా అయోధ్యలో బ్యాంకుల దగ్గర నుంచి అన్ని వ్యాపారసంస్థలు తమ సేవల్ని విస్తరిస్తున్నాయి. తాజాగా రెండు టెలికాం సంస్థలు తన నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి.

Published : 22 Jan 2024 01:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ టెలికాం సంస్థలైన వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea), ఎయిర్‌టెల్‌ (Airtel) అయోధ్యలో తమ నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి. రామమందిర ప్రతిష్ఠాపన నేపథ్యంలో అయోధ్యలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలు, సామర్థ్యాన్ని పెంచినట్లు ఆదివారం ప్రకటించాయి. దీంతో వినియోగదారులు స్పష్టమైన వాయిస్‌ కాల్స్‌, హై- స్పీడ్‌ డేటా, వీడియో స్ట్రీమింగ్‌ వంటి సదుపాయాల్ని పొందొచ్చని పేర్కొన్నాయి.

అయోధ్య రైల్వే స్టేషన్, రామమందిర ప్రాంగణం, విమానాశ్రయం, ప్రధాన ప్రాంతాలు, నగరంలోని హోటళ్లతో సహా అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో తమ నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచినట్లు వెల్లడించాయి. లఖ్‌నవూకు అనుసంధానించే హైవేలతో సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో L2100 స్పెక్ట్రమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచినట్లు వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. అదనపు నెట్‌వర్క్‌ సైట్లు, అంతరాయం లేని నెట్‌వర్క్‌ అందించటం కోసం ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ను ఏర్పాటు చేసినట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది.

2023లో భారత వస్తు సేవల ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి

ఇదిలా ఉండగా.. సోమవారం జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ప్రభుత్వం అతిథులుగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దాదాపు 7వేల మందికి పైగా అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతిరోజు మూడు నుంచి ఐదు లక్షల మంది సందర్శకులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని అయోధ్య డెవలప్‌మెంట్‌ అథారిటీ అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని