Vodafone Idea: ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో వీఐ కొత్త వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌

Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్‌ ప్లాన్‌ యూజర్ల కోసం కొత్త వార్షిక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 

Published : 22 Dec 2023 17:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ ప్రీపెయిడ్‌ యూజర్లలో చాలా మంది నెలవారీ రీఛార్జ్‌ చేస్తుంటారు. మరికొంత మంది ఏడాది మొత్తానికీ ఒకేసారి రీఛార్జ్‌ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసం వోడాఫోన్‌ ఐడియా (VI) కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి, ఈ ప్లాన్‌ ధర, ఇతర వివరాలు ఏంటో చూద్దాం. 

వీఐ తీసుకొచ్చిన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ రూ.3,199తో రీఛార్జ్‌ చేసుకుంటే.. 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2 జీబీ  చొప్పున ఏడాదిలో 730 జీబీ డేటా పొందొచ్చు. అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకి 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.  ఏడాదిపాటు అమెజాన్‌ ప్రైమ్‌ మొబైల్‌ వెర్షన్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. వీటితోపాటు రాత్రి 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అపరిమిత డేటా ఉచితంగా లభిస్తుంది. వీకెండ్‌ డేటా రోల్‌ఓవర్‌ ఫీచర్‌తో సాధారణ రోజుల్లో వినియోగించని డేటాను వారాంతాల్లో ఉపయోగించుకోవచ్చు. వీఐ మూవీస్‌, వీఐ టీవీ సబ్‌స్క్రిప్షన్‌ అదనంగా లభిస్తాయి. 

వేలిముద్ర వేస్తేనే మొబైల్‌ సిమ్‌!

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ సైతం ఇదే తరహా ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను అందిస్తున్నాయి. జియో రూ. 4,498తో రీఛార్జ్‌ చేసుకుంటే.. ఏడాదిపాటు అమెజాన్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, జీ5 వంటి 14 ఓటీటీల మొబైల్‌ వెర్షన్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. ఇక, ఎయిర్‌టెల్‌ రూ.3,359తో రీఛార్జ్‌ చేసుకుంటే.. ఏడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్‌, వింక్‌ మ్యూజిక్‌ మొబైల్‌ వెర్షన్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని