వేలిముద్ర వేస్తేనే మొబైల్‌ సిమ్‌!

ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందిన టెలికమ్యూనికేషన్‌ బిల్‌, 2023కు రాష్ట్రపతి అనుమతి లభించి.. కొత్త చట్టం అమల్లోకి వస్తే.. మొబైల్‌ కొత్త సిమ్‌ కార్డు కనెక్షన్‌ పొందేందుకు బయోమెట్రిక్‌ ధ్రువీకరణ (వేలిముద్ర వేయడం) తప్పనిసరి అవుతుంది.

Published : 22 Dec 2023 05:08 IST

ప్రస్తుత వినియోగదార్లకూ వర్తించే వీలు
టెలికాం బిల్లు నేపథ్యం

దిల్లీ: ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందిన టెలికమ్యూనికేషన్‌ బిల్‌, 2023కు రాష్ట్రపతి అనుమతి లభించి.. కొత్త చట్టం అమల్లోకి వస్తే.. మొబైల్‌ కొత్త సిమ్‌ కార్డు కనెక్షన్‌ పొందేందుకు బయోమెట్రిక్‌ ధ్రువీకరణ (వేలిముద్ర వేయడం) తప్పనిసరి అవుతుంది. ఇప్పటివరకు సిమ్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు ‘మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) కోసం అత్యధికుల వద్ద ఆధార్‌ సంఖ్య మాత్రమే తీసుకుంటున్నారు. జియో మాత్రం కొత్త కనెక్షన్‌ ఇచ్చేందుకు తొలి నుంచి వేలిముద్ర అవకాశాన్నీ తెచ్చింది. టెలికాం నూతన  చట్టం పూర్తిగా అమల్లోకి వస్తే, ప్రస్తుత మొబైల్‌ వినియోగదార్లు కూడా బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ ఇవ్వడం తప్పనిసరి అవుతుంది. ఈ బిల్లు ప్రకారం.. ‘టెలికాం సేవలను అందిస్తున్న ఏదైనా అధీకృత సంస్థ తన సేవలను అందించడానికి సిమ్‌ ఇచ్చే వ్యక్తిని బయోమెట్రిక్‌ ఆధారంగా గుర్తించాల్సి ఉంటుంది’. నిబంధనలు నోటిఫై అయిన తర్వాతే, బయోమెట్రిక్‌ తప్పనిసరిపై స్పష్టత రానుంది. ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌, 1885, సంబంధిత చట్టాల స్థానంలో కొత్త చట్టం రానుంది. ఇండియన్‌ వైర్‌లెస్‌ టెలిగ్రఫీ యాక్ట్‌ 1933, టెలిగ్రాఫ్‌ వైర్స్‌(అన్‌లాఫుల్‌ పొసెసన్‌) యాక్ట్‌-1950లనూ టెలికాం బిల్లు భర్తీ చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని