Vodafone Idea: నచ్చిన ఓటీటీ ఎంచుకొనేలా వీఐ ప్లాన్లు.. వారికి మాత్రమే!

Vodafone Idea: ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా.. తన యూజర్లకు నచ్చిన ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకొనే సదుపాయాన్ని తీసుకొచ్చింది.

Published : 07 Oct 2023 17:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ యూజర్లకు నచ్చిన ఓటీటీ (OTT) సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకునేందుకు ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) అవకాశం కల్పిస్తోంది. రీఛార్జి ప్లాన్‌ అనుగుణంగా వీఐ అందించే ఎంపికల్లో నచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకొనే సదుపాయాన్ని కల్పిస్తోంది. అయితే, కేవలం పోస్ట్‌ పెయిడ్‌ (postpaid) కస్టమర్లు మాత్రమే ఈ ప్రయోజనం పొందవచ్చని పేర్కొంది.

ఎయిరిండియా విమానాల నయా లుక్‌.. ఫొటోలు వైరల్‌

ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా అందిస్తున్న వీఐ మ్యాక్స్‌ (Vi Max) పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లు రూ.401 నుంచి ప్రారంభమవుతున్నాయి. రూ.401 రీఛార్జితో 50జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, నెలకు 300 ఎస్సెమ్మెస్‌లు అందిస్తోంది. వీటితో పాటూ హంగామా మ్యూజిక్‌, వీఐ మూవీస్‌, వీఐ టీవీ, వీఐ గేమ్స్‌ కూడా పొందవచ్చు. అంతే కాకుండా.. డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌, సోనీలివ్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌, సన్‌ నెక్ట్స్‌ ప్రీమియం, ఈజ్‌మైట్రిప్ ద్వారా రిటర్న్‌ విమానాల బుకింగ్‌పై నెలకు రూ.750 తగ్గింపు... ఇలా ఏడాది పాటూ వచ్చే ఈ ఆప్షన్లలో ఏదో ఒక దాన్ని కస్టమర్లే ఎంపిక చేసుకోవచ్చు. అచ్చం అలానే.. వీటితో పాటూ నచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను కూడా యూజర్లు ఎంపిక చేసుకోవచ్చన్నమాట. వీఐ అందిస్తోన్న మ్యాక్స్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్లలో రూ.501 రీఛార్జ్‌ చేసుకుంటే రెండు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, రూ.701తో రీఛార్జ్‌ చేసుకుంటే మూడు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు పొందవచ్చు. ఇదిలా ఉండగా.. కుటుంబంలోని సభ్యుల్లో ఒకరు పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ కస్టమర్లు అయితే తన వద్ద ఉన్న డేటాను మరొకరితో పంచుకొనే సదుపాయాన్ని వీఐ ఇటీవల తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు