WhatsApp: వాట్సప్‌ ప్రొఫైల్‌ ఫొటోలను ఇక స్క్రీన్‌ షాట్‌ తీయలేరు

WhatsApp: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ స్క్రీన్‌ షాట్‌ బ్లాక్‌ ఫీచర్‌ని తీసుకురావాలని చూస్తోంది.

Updated : 21 Feb 2024 18:17 IST

WhatsApp | ఇంటర్నెట్‌డెస్క్‌: యూజర్ల ప్రైవసీ పెంచడంలో భాగంగా ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) కొత్త అప్‌డేట్‌తో వస్తోంది. అన్‌నోన్‌ కాల్‌ బ్లాకింగ్‌, చాట్‌లాక్‌ వంటి ఫీచర్లు తీసుకొచ్చిన వాట్సప్‌.. స్క్రీన్‌ షాట్‌ బ్లాక్‌ (screenshot block feature) సదుపాయాన్ని తీసుకురానుంది. దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో పంచుకుంది.

వాట్సప్‌లో ఇప్పటికే ఉన్న ప్రైవసీ ఫీచర్‌ ద్వారా నచ్చినవాళ్లకు మాత్రమే ప్రొఫైల్‌ ఫొటో కనిపించేలా సెట్టింగ్స్‌ మార్చుకునే వీలుంది. అదే సమయంలో ప్రొఫైల్‌ పిక్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసుకొనే సదుపాయం ఉంది. దీంతో యూజర్ల ఫొటోలను ఉపయోగించి వేధింపులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈతరహా ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ అప్‌డేట్‌తో ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరి ప్రొఫైల్‌ ఫొటోనైనా స్క్రీన్‌ షాట్‌ తీయాలని ప్రయత్నించినా ఇకపై అది వీలుకాదు.

నిర్మాణ రంగంలో చెల్లింపుల కోసం ‘బెట్టాపే’

వాట్సప్‌ తీసుకొచ్చిన ప్రారంభంలో ప్రొఫైల్‌ ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకొనే సదుపాయం ఉండేది. ప్రైవసీని పెంచడంలో భాగంగా 2019లో ఆ సదుపాయాన్ని తొలగించింది. తాజాగా ప్రొఫైల్‌ ఫొటోలను స్క్రీన్‌ షాట్‌ తీసే సదుపాయాన్ని తీసేయాలని చూస్తోంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఫేస్‌బుక్‌లో ఇదివరకే ఈ తరహా ఆప్షన్‌ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని