Bettapay: నిర్మాణ రంగంలో చెల్లింపుల కోసం ‘బెట్టాపే’

Bettapay: డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బెట్టాపేను రూపొందించినట్లు బెట్టామింట్ తెలిపింది.

Published : 21 Feb 2024 15:34 IST

దిల్లీ: వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ బెట్టామింట్ నిర్మాణరంగంలో ఆర్థిక లావాదేవీల కోసం ‘బెట్టాపే’ (Bettapay) అనే చెల్లింపుల సాధనాన్ని ప్రారంభించింది. బిల్లులు, వేతనాలు, ప్రోత్సాహకాల చెల్లింపులను ఆధారం చేసుకునే డెబిట్‌ నోట్స్‌, కార్మికుల హాజరు, పనితీరు వంటి అంశాలను బెట్టాపేకు అనుసంధానం చేయొచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తద్వారా అధీకృత విధానంలో చెల్లింపులు చేసేలా డెవలపర్లు, కాంట్రాక్టర్లపై నిర్వహణ భారం తగ్గుతుందని పేర్కొంది.

కార్మికులకు డిజిటల్‌ మాధ్యమంలో చెల్లింపులు చేయాలన్న ప్రభుత్వ మార్గదర్శకాలను సైతం బెట్టాపేతో (Bettapay) అమలుచేసినట్లవుతుందని బెట్టామింట్‌ వివరించింది. రుణ సంస్థలు, రెరా వంటి రెగ్యులేటరీలకూ నిర్మాణ ప్రాజెక్టుల పర్యవేక్షణ సులభమవుతుందని తెలిపింది. పారదర్శకత, జవాబుదారీతనం, కచ్చితత్వాన్నీ పెంపొందించవచ్చని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని