Whatsapp: వాట్సప్‌లో ఈ ఐకాన్‌ మీకూ కనిపించిందా? ఆ కొత్త ఫీచర్‌ ఇదే..!

వాట్సప్‌ మరో కొత్త ఫీచర్‌ను టెస్ట్‌ చేస్తోంది. త్వరలోనే వాట్సప్‌కు ఏఐ ఫీచర్లను జోడించనుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియరాలేదు.

Published : 11 Apr 2024 19:15 IST

Whatsapp | ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (Whatsapp) మరో కొత్త ఫీచర్‌కు సిద్ధమైంది. ఇప్పటివరకు చాట్స్‌, ఆడియో/వీడియో కాల్స్‌కు పరిమితమైన ఈ యాప్‌.. ఇప్పుడు ఏఐ ఫీచర్లకు రెడీ అయ్యింది. ఇందులోభాగంగా మెటా ఏఐను వాట్సప్‌నకు జోడించనుంది. ఇందులో చాట్‌ మెనూలో వివిధ రంగులతో కూడిన వృత్తాకారంలో ఉన్న ఐకాన్‌ కనిపించింది. భారత్‌లో కొందరు యూజర్లకు ఈ ఫీచర్‌ దర్శనమిచ్చింది. కాసేపటి తర్వాత అదృశ్యమైంది.

ఇతర సంస్థలతో పోటీగా మెటా కూడా లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ ఆధారిత మెటా ఏఐని (Meta AI) రూపొందించింది. దీన్ని వాట్సప్‌కు జోడించనుందని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఇందులోభాగంగానే ఈ ఫీచర్‌ను టెస్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బటన్‌పై క్లిక్‌ చేస్తే ‘ఆస్క్‌ మెటా ఏఐ ఎనీథింగ్‌’ అంటూ ఓ పాప్‌ ఓపెన్‌ అవుతుంది. కంటిన్యూపై క్లిక్‌ చేస్తే మెటా ఏఐతో చాట్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. ఈ చాట్‌ మెనూలో సైన్స్‌, హిస్టరీ, టెక్నాలజీ వంటి వివిధ అంశాలకు సంబంధించిన చాట్‌జీపీటీ తరహాలో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. అయితే, మెటా ఏఐ చాట్‌ బాక్స్‌కు మాత్రమే పరిమితమని.. యూజర్ల కాల్స్‌, మెసేజ్ లను రీడ్‌ చేయబోమని చెబుతోంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ పరీక్ష దశలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని