WhatsApp: వాట్సప్‌ పేమెంట్స్‌ ఇక మరింత సులువుగా.. ఇక చాట్‌ లిస్ట్‌లోనే

WhatsApp payments: వాట్సప్‌లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్‌ లిస్ట్‌లోనే ఇకపై క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ కనిపించనుంది.

Published : 19 Mar 2024 00:56 IST

WhatsApp payments | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో వాట్సప్‌ (Whatsapp) తన పేమెంట్‌ సేవలు ప్రారంభించి చాలా రోజులే అయినప్పటికీ.. ఆదరణ మాత్రం అంతంతే. చాట్‌ చేసేందుకు, స్టేటస్‌లు చూసేందుకు, ఆడియో/ వీడియో కాల్స్‌ చేసుకునేందుకు వాట్సప్‌ను విరివిగా వాడుతున్న యూజర్లు.. చెల్లింపుల వద్దకు వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారు. దీంతో యూజర్లను చేరుకునేందుకు వాట్సప్‌ ప్లాన్‌తో ముందుకొచ్చింది. పేమెంట్స్‌ ఫీచర్‌ను సులభతరం చేసింది.

ప్రస్తుతం వాట్సప్‌ పేమెంట్స్‌ చేయాలంటే త్రీ డాట్స్‌ మెనూలో ఉన్న పేమెంట్స్‌ మెనూలోకి వెళ్లి ప్రక్రియ పూర్తి చేయాలి. ఇకపై చాట్‌ లిస్ట్‌ నుంచే ఆ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. వాట్సప్‌ బ్యానర్‌, కెమెరా సింబల్‌ మధ్యలో కొత్తగా క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ను ఇస్తున్నారు. దాంతో వాట్సాప్‌ యూపీఐకి లింక్‌ చేసిన ఖాతా నుంచి పేమెంట్స్‌ పూర్తి చేయొచ్చు. దీనివల్ల యూజర్ల సమయం ఆదా అవ్వడంతో పాటు, యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ కూడా మెరుగుకానుంది.

MNP: మొబైల్‌ నంబర్‌ పోర్టింగ్‌కు కొత్త రూల్‌.. జులై 1 నుంచి అమల్లోకి

ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా టెస్టర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఎవరైతే వాట్సప్‌ బీటా వెర్షన్‌ 2.24.7.3 డౌన్‌లోడ్‌ చేసుకున్నవారికి ఈ ఫీచర్‌ దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. వాట్సప్‌లో రాబోయే ఫీచర్ల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించే వాబీటా ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలో మిగిలిన యూజర్లందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని