Reply limitation: ఎక్స్‌లో మరో మార్పు.. ఇక రిప్లయ్‌ కష్టమే!

X brings new feature: ఎక్స్‌లో మరో మార్పు చోటుచేసుకుంది. వెరిఫైడ్‌ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లయ్‌లు వచ్చేలా కొత్త ఆప్షన్‌ తీసుకొచ్చారు.

Updated : 10 Oct 2023 18:43 IST

X brings new feature | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ఎక్స్‌లో (X) మరో మార్పు చోటుచేసుకుంది. రిప్లయ్‌ విషయంలో యూజర్లకు ఆ సంస్థ మరింత కంట్రోల్ ఇచ్చింది. రిప్లయ్‌లను పరిమితం చేసేందుకు గానూ కొత్తగా వెరిఫైడ్‌ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లయ్‌లు (Reply limitation) వచ్చేలా ఆప్షన్‌ను యాడ్‌ చేసింది. దీనివల్ల ఎక్స్‌లో వెరిఫైడ్‌ కాని యూజర్లు రిప్లయ్‌ ఇవ్వడం సాధ్యపడదు.

సాధారణంగా ఎవరైనా ప్రముఖ వ్యక్తి పోస్టు పెడితే.. ఇతరులు కామెంట్ల రూపంలో రిప్లయ్‌ ఇస్తుంటారు. ఒకవేళ ఆ వ్యక్తి కేవలం వెరిఫైడ్‌ యూజర్లు మాత్రమే రిప్లయ్‌ ఇచ్చేలా ఆప్షన్‌ను ఎంచుకుంటే.. సాధారణ యూజర్లు ఎవరూ ఇకపై రిప్లయ్‌ ఇవ్వడం సాధ్యపడదు. ఒక విధంగా ఈ ఆప్షన్‌.. ఎక్స్‌ యూజర్లను వెరిఫైడ్‌ అకౌంట్లు వైపు మళ్లించే చర్యగా కనిపిస్తోందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ఆప్షన్‌ వల్ల ప్రముఖులకు వేధింపులు, ట్రోలింగుల బెడద తగ్గే అవకాశం ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

Laptop Deals: పండగ ప్రత్యేక సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లివే..!

ఇప్పటికే ఈ తరహా ఆప్షన్‌ ఎక్స్‌లో అందుబాటులో ఉంది. కాకపోతే అందులో ‘ఎవ్రీవన్‌’, ‘మిమ్మల్ని ఫాలో అవుతున్న వ్యక్తులు’ ‘కేవలం మీరు మెన్షన్‌ చేసిన వ్యక్తులు’ అనే ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. కొత్తగా వెరిఫైడ్‌ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లయ్‌లు వచ్చే ఆప్షన్‌ను తీసుకొచ్చారు. ఈ ఆప్షన్‌ లైవ్‌లోకి వచ్చింది. ఒకవేళ వెరిఫైడ్‌ బ్లూ టిక్‌ పొందాలంటే ఆండ్రాయిడ్‌ యూజర్లు నెల నెలా రూ.900 చెల్లించాల్సిందే. వీరికి సాధారణ యూజర్లతో పోలిస్తే కొన్ని అదనపు సదుపాయాలను కల్పిస్తున్నారు. పోస్టులు ఎడిట్‌ చేసుకోవడం, సుదీర్ఘమైన పోస్టులతో పాటు, సుదీర్ఘమైన వీడియోలు సైతం పోస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని