Laptop Deals: పండగ ప్రత్యేక సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లివే..!

Laptop Deals: పండగ ప్రత్యేక సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై ఇ-కామర్స్‌ సంస్థలు రాయితీలు ప్రకటించాయి. కొనాలని ప్లాన్‌ చేసుకునేవారు కింద ఇచ్చిన కొన్ని మోడళ్లను పరిశీలించొచ్చు.

Updated : 10 Oct 2023 14:02 IST

Laptop Deals | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా పండగ సీజన్‌ హడావుడి ప్రారంభమైంది. ప్రత్యేక సేల్‌ (Festival Sale)లో భాగంగా ఇ-కామర్స్‌ సంస్థలు, రిటైల్‌ ఔట్‌లెట్‌లు అందిస్తున్న ఆఫర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది ఈ సమయంలో ఫ్యాషన్‌, బ్యూటీ ఉత్పత్తులతో పాటు స్మార్ట్‌ఫోన్లు, వాచ్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్స్‌ గ్యాడ్జెట్లనూ కొనుగోలు చేస్తుంటారు. ఇక వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, గేమింగ్‌ ఔత్సాహికులు, స్టూడెంట్స్‌ ల్యాప్‌టాప్‌లపై ఆఫర్ల కోసం వెతుకుతుంటారు. మరి ఇ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ల్యాప్‌టాప్‌లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూద్దాం..

అమెజాన్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో..

లెనోవో ఐడియాప్యాడ్‌ గేమింగ్‌ 3 (Lenovo IdeaPad Gaming 3)..

లెనోవో ఐడియాప్యాడ్‌ గేమింగ్‌ 3 ల్యాప్‌టాప్‌ కొత్తదేమీ కాదు. కానీ, ప్రస్తుత సేల్‌లో ఉన్న ధర మాత్రం కస్టమర్లకు ఆకట్టుకుంటోంది! దీని ఒరిజినల్‌ ధర రూ.75 వేలు కాగా.. తాజా సేల్‌లో రూ.64,490కే లభిస్తోంది. ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.1,500 తగ్గుతుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ఐపీఎస్‌ తెర, ఏఎండీ రైజెన్‌ 6600 హెచ్‌ ప్రాసెసర్‌తో వస్తోంది. ఎన్వీడియా GeForce RTX 3050 గ్రాఫిక్స్‌ను ఇస్తున్నారు.

హానర్‌ మ్యాజిక్‌బుక్‌ ఎక్స్‌14 (Honor MagicBook X14)..

12వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ5 12450H CPUతో వస్తున్న హానర్‌ మ్యాజిక్‌బుక్‌ ఎక్స్‌14 తాజా సేల్‌లో రూ.41,990 ప్రారంభ ధర వద్ద లభిస్తోంది. ఎస్‌బీఐ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై అదనంగా మరో రూ.750 రాయితీ కూడా వస్తోంది. రూ.15,700 ఎక్స్ఛేంజ్‌ రాయితీని కూడా పొందొచ్చు. 60Wh బ్యాటరీ ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 12 గంటల వరకు ప్లేటైమ్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది.

స్మార్ట్‌ టీవీకి పండగే

ఆసుస్‌ జెన్‌బుక్‌ 14ఎక్స్‌ (Asus Zenbook 14X)..

రూ.98,990తో మార్కెట్‌లోకి వచ్చిన ఆసుస్‌ జెన్‌బుక్‌ 14 ఎక్స్‌ తాజా సేల్‌లో రూ.69,990కి అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన ల్యాప్‌టాప్‌ మోడల్స్‌పై రూ.10,700 ఎక్స్ఛేంజ్‌ రాయితీ కూడా పొందొచ్చు. నెలకు రూ.11,665 దగ్గరి నుంచి నో-కాస్ట్‌ ఈఎంఐ కూడా ప్రారంభమవుతోంది. ఈ ల్యాప్‌టాప్‌లో 12వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ5 12500 హెచ్‌ ప్రాసెసర్‌ను ఇస్తున్నారు. Intel Iris Xe గ్రాఫిక్స్‌ ఉంది. ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌ కూడా ఉంది. ఒక్క ఛార్జింగ్‌తో ఎనిమిది గంటల బ్యాటరీ లైఫ్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది. 16జీబీ ర్యామ్‌ 512 జీబీ స్టోరేజ్‌ ఉంది.

హెచ్‌పీ 15ఎస్‌ (HP 15s)..

హెచ్‌పీ 15ఎస్‌ తాజా అమెజాన్‌ సేల్‌లో రూ.35,990కి లభిస్తోంది. దీని అసలు ధర రూ.45,557. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ ద్వారా మరో రూ.10,700 వరకు తగ్గుతుంది. ఎస్‌బీఐ కార్డ్‌ ద్వారా మరో రూ.750 రాయితీ లభిస్తుంది. 11వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్‌ 8జీబీ ర్యామ్‌ 512 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది.

ఎంఎస్‌ఐ మోడర్న్‌ 14 (MSI Modern 14)..

రూ.78,990తో మార్కెట్‌లోకి ప్రవేశించిన ఎంఎస్‌ఐ మోడర్న్‌ 14 ల్యాప్‌టాప్‌ ప్రస్తుత సేల్‌లో రూ.49,990కి అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్‌ కింద మరో రూ.11,700 తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్‌ రాయితీలు కూడా ఉన్నాయి. 12వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్‌పై నడిచే ఈ ల్యాప్‌టాప్‌ 16జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది.

డెల్‌ వోస్ట్రో 3520 (Dell Vostro 3520)..

బడ్జెట్‌లో డెల్‌ ల్యాప్‌టాప్‌ తీసుకోవాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్‌ అని నిపుణులు సూచిస్తున్నారు. దీని అసలు ధర రూ.44,524 కాగా.. ఇది తాజా సేల్‌లో రూ.35,990కే అందుబాటులో ఉంది. అదనంగా రూ.10,700 రాయితీ కూడా లభిస్తుంది. ఎస్‌బీఐ కార్డు ద్వారా రాయితీ పొందొచ్చు. ఇంటెల్‌ ఐ3 ప్రాసెసర్‌, 15.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ తెరతో వస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో (Flipkart Big Billion Days)..

లెవోవో ఐడియాప్యాడ్‌ 1 ఎథ్లాన్‌ డ్యుయల్‌ కోర్‌ (Lenovo ideapad 1 athlon Dual Core)..

దీని వాస్తవ ధర రూ.43,790. తాజా ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఇది రూ.24,990కే లభిస్తోంది. అదనంగా ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది. దీంట్లో ఏఎండీ ఎథ్లాన్‌ డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌ ఉంది. 15.6 అంగుళాల తెరతో వస్తున్న ఈ ల్యాప్‌టాప్‌పై ఏడాది వారంటీ కూడా వస్తోంది.

పండగ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌ కొంటున్నారా? అమెజాన్‌లో వీటిపై ఓ లుక్కేయండి!

శాంసంగ్‌ గెలాక్సీ బుక్‌ 2 (Samsung Galaxy book 2)..

12వ జనరేషన్‌ ఐ5 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్‌ ఒరిజినల్‌ ధర రూ.82,990. తాజా సేల్‌లో ఇది రూ.49,990కి లభిస్తోంది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద మరింత తగ్గుతుంది. 8 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ ఉంది.

ఆసుస్‌ వివోబుక్‌ 15 (Asus Vivobook 15)..

ఆసుస్‌ వివోబుక్‌ 15 ధర రూ.44,990. తాజా సేల్‌లో ఇది రూ.29,990 లభిస్తోంది. 11వ జనరేషన్‌ ఐ3 ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ తెరను పొందుపర్చారు.

డెల్‌ ఇన్‌స్పిరాన్‌ కోర్‌ ఐ5 (Dell Inspiron core i5)..

12వ జనరేషన్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌తో వస్తోన్న డెల్‌ ఇన్‌స్పిరాన్‌ ల్యాప్‌టాప్‌లో చాలా వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిపై ఫ్లిప్‌కార్ట్‌లో 30శాతానికి పైగా రాయితీ లభిస్తోంది.

ఏసర్‌ ఎక్స్‌టెన్సా (2023) (Acer Extensa 2023)..

ఏసర్‌ నుంచి వస్తున్న ఈ ల్యాప్‌టాప్‌.. ఇంటెల్‌ కోర్‌ ఐ3 12వ జనరేషన్‌, 8జీబీ ర్యామ్‌, 12జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లతో వస్తోంది. దీని అసలు ధర రూ.44,999. తాజా సేల్‌లో ఇది రూ.30,990కే అందుబాటులో ఉంది. ఇతర ఎక్స్‌టెన్సా వేరియంట్లపైనా దాదాపు 30 శాతం వరకు రాయితీ లభిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని