Elon Musk: ‘ఎక్స్‌’లో ఆడియో, వీడియో కాల్స్‌.. వీళ్లకు మాత్రమే

Elon Musk: ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్‌ని ‘ఎక్స్‌’ తీసుకొచ్చింది. ప్రీమియం యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది.

Updated : 20 Jan 2024 18:48 IST

Elon Musk | ఇంటర్నెట్‌డెస్క్‌: ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నేతృత్వంలోని సోషల్‌ మీడియా సంస్థ ‘ఎక్స్’ కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ యూజర్లకు యాప్‌ ద్వారా నేరుగా ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకొనే సదుపాయం కల్పించింది. యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ పొందొచ్చు. ‘ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం ‘ఎక్స్‌’లో ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్‌ అందుబాటులోకి వస్తోంది. యాప్‌ను అప్‌డేట్‌ చేసి ఫీచర్‌ను వినియోగించుకోండి’ అంటూ ఎక్స్‌ ఇంజినీర్‌ ఎన్రిక్‌ ‘ఎక్స్‌’ ద్వారా తెలిపారు.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ లాభం ₹4,265 కోట్లు

ఆడియో, వీడియో కాల్స్‌ సదుపాయం ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీన్ని వినియోగించాలంటే ‘ఎక్స్‌’ యాప్‌లో ‘Settings’లోకి వెళ్లి ‘Privacy & Safety’ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ‘Direct Messages’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. మిమ్మల్ని అనుసరిస్తున్నవారు, మీరు అనుసరిస్తున్న, వెరిఫైడ్‌ యూజర్లు.. వీటిలో మీకు నచ్చిన ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఇప్పటికే కొందరు యూజర్లకు   ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిందని ‘ఎక్స్‌’ వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని