Diwali with Mi Sale: ఎంఐ పండగ సేల్‌.. స్మార్ట్‌ఫోన్లపై 45 శాతం వరకు డిస్కౌంట్‌

Diwali with Mi Sale: పండగ సీజన్‌ నేపథ్యంలో షావోమి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై రాయితీలు ఉన్నాయి.

Updated : 06 Oct 2023 15:19 IST

Diwali with Mi Sale | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షావోమి వివిధ రకాల ఆఫర్లతో పండగ సేల్‌ (Festival Sale)కు సిద్ధమైంది. మొబైళ్లు, ట్యాబ్లెట్లు సహా ఇతర ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది. ‘దీపావళి విత్‌ ఎంఐ (Diwali with Mi)’.. ఈ ప్రత్యేక సేల్‌ కంపెనీ వెబ్‌సైట్‌ సహా అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ (Amazon Great Indian Festival Sale), ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ (Flipkart Big Billion Days Sale)లోనూ అందుబాటులో ఉంటుంది. షావోమి సేల్‌ (Xiaomi Sale) అక్టోబర్‌ 7 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఇది అక్టోబర్‌ 8 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

‘దీపావళి విత్‌ ఎంఐ (Diwali with Mi)’ సేల్‌లో షావోమి, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ల (Redmi Phones)పై 45 శాతం వరకు రాయితీ లభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు స్మార్ట్‌ హోమ్‌ డివైజ్‌లపై 65 శాతం వరకు తగ్గింపు ఉన్నట్లు వెల్లడించింది. షావోమి లేదా రెడ్‌మీ టీవీ (Redmi TV) కొనేవారికి 60 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తున్నట్లు తెలిపింది. ఎంఐ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసేవారికి మరిన్ని ఆఫర్లు ఉంటాయని వెల్లడించింది.

పండగ సేల్‌లో ఫోన్‌ కొంటున్నారా?మంచి ఫోన్‌ ఎలా ఎంచుకోవాలంటే..

ఎంఐ సేల్‌ డీల్స్‌..

రెడ్‌మీ నోట్‌ 12 5జీ (Redmi Note 12 5G)..

రెడ్‌మీ నోట్‌ 12 5జీ (Redmi Note 12 5G) ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ ఉన్న 6.67 అంగుళాల అమోలెడ్‌ తెరను అమర్చారు. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.19,999. దీన్ని తాజా సేల్‌లో భాగంగా రూ.13,749కి తగ్గించింది. 48MP ప్రధాన కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా ఉంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జనరేషన్‌ ప్రాసెసర్‌, 33W ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు.

రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 5జీ (Redmi Note 12 Pro 5G)..

రూ.27,999 ధర వద్ద మార్కెట్‌లోకి వచ్చిన రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 5జీ (Redmi Note 12 Pro 5G) 12GB RAM + 256GB స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్‌ తాజా సేల్‌లో రూ.17,999కే లభిస్తోంది. 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ అమోలెడ్‌ తెర, ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌, 50MP ప్రధాన కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

రెడ్‌మీ బడ్స్‌ 4 యాక్టివ్‌ టీడబ్ల్యూఎస్‌ (Redmi Buds 4 Active TWS) ఇయర్‌ఫోన్స్‌..

30 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌తో వచ్చిన రెడ్‌మీ బడ్స్‌ 4 యాక్టివ్‌ ఇయర్‌ఫోన్స్‌ (Redmi Buds 4 Active TWS) సైతం ఈ సేల్‌లో ఉన్నాయి. ఇది జూన్‌లో రూ.2,999 ధర వద్ద విడుదలైంది. ప్రస్తుత సేల్‌ ఇది రూ.899కే లభిస్తోంది. నలుపు, తెలుపు రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే బడ్స్‌ బ్యాటరీ లైఫ్‌ ఐదు గంటల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.

రెడ్‌మీ 43 అంగుళాల స్మార్ట్‌ ఫైర్‌ టీవీ (Redmi 43-inch Smart Fire TV)..

43 అంగుళాల స్మార్ట్‌ ఫైర్‌ టీవీ (Redmi 43-inch Smart Fire TV)పై తాజా సేల్‌లో బారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. రూ.42,999 దగ్గర లాంఛ్‌ అయిన ఈ టీవీ ప్రస్తుత సేల్‌లో రూ.19,999కే అందుబాటులో ఉంది. 60Hz రీఫ్రెష్‌ రేట్‌తో 4కే తెర, క్వాడ్‌ కోర్‌ ఏ55 ప్రాసెసర్‌, మాలి G52 MC1 GPU, డాల్బి ఆడియోతో 24W స్పీకర్లు, డీటీఎస్‌ వర్చువల్‌ ఎక్స్‌, డీటీఎస్‌ హెచ్‌డీ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

షావోమి రోబో వాక్యూమ్‌ మాప్‌ 2 ప్రో (Xiaomi Robot Vacuum-Mop 2 Pro)..

గృహోపకరణాలపైనా ఎంఐ ఆఫర్లను ప్రకటించింది. రోబో వాక్యూమ్‌ మాప్‌ 2 ప్రో (Xiaomi Robot Vacuum-Mop 2 Pro)ను రూ.23,999కే అందిస్తోంది. దీని ఒరిజినల్‌ ధర రూ.39,999. 19 సెన్సర్లతో ఉండే ఈ మాప్‌లో 5,200mAh బ్యాటరీని పొందుపర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని