Xiaomi: ఆ స్క్రీన్‌ ప్రొటెక్టర్లు వాడొద్దు.. వినియోగదారులకు షావోమీ అలర్ట్‌!

Xiaomi warns users: యూజర్లకు షావోమీ అలర్ట్‌ జారీ చేసింది. లిక్విడ్‌ యూవీ స్క్రీన్‌ ప్రొటెక్టర్లను వాడొద్దని సూచించింది. ఒకవేళ వాడితే వారెంటీ పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Published : 23 Feb 2024 14:11 IST

Xiaomi | ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసినప్పుడు కంపెనీ ఇచ్చిన స్క్రీన్‌ ప్రొటెక్టర్‌ను (screen protectors) తొలగించి కొత్త రక్షణ పొర వేస్తుంటాం. ఫోన్‌ తెరపై గీతలు పడకుండా వివిధ రకాల స్క్రీన్‌ గార్డులను వినియోగిస్తుంటాం. ఈ క్రమంలోనే లిక్విడ్‌ యూవీ అదెసివ్‌ ప్రొటెక్టర్లు పుట్టుకొచ్చాయి. కర్వ్‌డ్‌ డిస్‌ప్లే కలిగిన స్మార్ట్‌ఫోన్లు వాడేవారు ఈ తరహా గార్డులను వినియోగిస్తున్నారు. అయితే, ఈ విషయంలో ప్రముఖ చైనా కంపెనీ షావోమీ (Xiaomi).. తమ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఈ తరహా ప్రొటెక్టర్లను వాడొద్దని సూచించింది.

కర్వ్‌డ్‌ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ల కోసం చాలా మంది లిక్విడ్‌ యూవీ అదెసివ్‌ ప్రొటెక్టర్లను వాడుతున్నారని, దీనివల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని షావోమీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రొటెక్టర్‌ సరిగా అతికించేందుకు వాడే లిక్విడ్‌.. ఛార్జింగ్‌ పోర్ట్‌, స్పీకర్‌ హోల్‌, బ్యాటరీ కవర్‌లోకి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనివల్ల స్మార్ట్‌ఫోన్‌ రీస్టార్ట్ అవ్వడం, బటన్స్‌ సరిగా పనిచేయకపోవడం, స్పీకర్‌ నుంచి ఒకరకమైన శబ్దాలు రావడంతో పాటు బ్యాటరీ కవర్‌ ఊడిపోవచ్చని పేర్కొంది. కాబట్టి యూవీ ప్రొటెక్టర్లను వాడొద్దని యూజర్లకు సూచించింది. దీనివల్ల వారెంటీ పోయే ప్రమాదం ఉందని తెలిపింది.

WhatsApp: వాట్సప్‌లో పంపే టెక్ట్స్‌ మరింత ఆకర్షణీయంగా..

ప్రత్యామ్నాయంగా ట్యాంపర్డ్‌ గ్లాసులు, ఎలక్ట్రోస్టాటిక్‌ ఫిల్మ్స్‌ను వినియోగించుకోవచ్చని షావోమీ సూచించింది. అలాగే రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ యూజర్లకు స్క్రీన్‌ ప్రొటెక్టర్లను అందించడంతో పాటు, ఉచితంగానే ఇన్‌స్టాల్‌ చేసి ఇస్తామంది. స్క్రీన్‌ ప్రొటెక్టర్ల గురించి ఒక స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ నుంచి ఈ తరహా హెచ్చరిక రావడం ఇదే తొలిసారి. ఇతర కంపెనీలేవీ ఇప్పటి వరకు అలర్ట్‌లు జారీ చేయలేదు. ఈ ప్రొటెక్టర్లను అతికించేటప్పుడు లిక్విడ్‌ను స్క్రీన్‌పై పోసి, దానిపై గ్లాస్‌ అతికిస్తారు. ఆపై యూవీ లైట్‌తో స్క్రీన్‌ను హీట్‌ చేస్తారు. కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఫోన్లు వచ్చాక ఇవి బాగా పాపులర్‌ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని