YouTube: యూట్యూబ్‌లో ఇక గేమ్స్‌.. వీరికి మాత్రమే!

YouTube: ప్రీమియం సబ్‌స్క్రైబర్లను సంఖ్యను పెంచుకోవటంలో భాగంగా యూట్యూబ్‌ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Updated : 07 Dec 2023 15:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ (YouTube) తాజాగా గేమింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. తన ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా గేమ్స్‌ ఆడే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌లోని యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ‘Playables’ పేరిట తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను ప్రీమియం చందాదారులు డౌన్‌లోడ్‌లు లేకుండానే వినియోగించవచ్చు.

యూపీఐ, బ్యాంకింగ్‌ మోసాలు.. పోయిన డబ్బు తిరిగి పొందొచ్చా?

ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూట్యూబ్‌ యాప్‌ ద్వారా దాదాపు 37 పాపులర్‌ గేమ్స్‌ని ఆడొచ్చు. యాంగ్రీ బర్డ్స్‌ షోడౌన్‌, కానన్‌ బాల్స్‌ త్రీడి వంటి యాక్షన్‌ గేమ్‌లు, డైలీ క్రాస్‌వర్డ్‌ వంటి పజిల్ గేమ్‌లు ఇందులో ఉన్నాయి. ఈ ఫీచర్‌ వచ్చే ఏడాది మార్చి 28 వరకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. యూట్యూబ్‌ యాప్‌లోని హోమ్‌పేజీని కిందకు స్క్రోల్‌ చేయగానే కనిపించే ప్లేయబుల్స్‌ షెల్ఫ్‌ ఆప్షన్‌ ఎనేబల్‌ చేసుకొని ఈ గేమ్స్‌ ఆడొచ్చు. మీ ప్రొఫైల్‌ ఐకాన్‌ని ట్యాప్‌ చేసి కిందకు స్క్రోల్ చేసి ‘Your Premium benefits' ట్యాప్‌ చేసి ‘Try experimental new features’ ఆప్షన్‌ ట్యాప్‌ చేసి ఈ ఫీచర్‌ యాక్సెస్‌ చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని