Adibatla kidnap Case: గోవా నుంచి హైదరాబాద్‌కు నవీన్‌రెడ్డి.. తీసుకొస్తున్న పోలీసులు

మన్నెగూడ జరిగిన బీడీఎస్‌ విద్యార్థిని కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు, మిస్టర్‌ టీ ఎండీ నవీన్‌రెడ్డిని  గోవాలో అదుపులోకి తీసుకున్న ఆదిభట్ల పోలీసులు..హైదరాబాద్‌ తీసుకొస్తున్నారు. 

Updated : 14 Dec 2022 10:42 IST

హైదరాబాద్‌: మన్నెగూడలో బీడీఎస్‌ విద్యార్థిని కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు, మిస్టర్‌ టీ ఎండీ నవీన్‌రెడ్డిని హైదరాబాద్‌ తీసుకొస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆదిభట్ల సీఐ నరేందర్‌ ఆధ్వర్యంలోని బృందం గోవాలో అతడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 

నవీన్‌రెడ్డిపై ఆదిభట్లలో మూడు కేసులు ఉండగా.. వరంగల్‌లో రెండేళ్ల క్రితం మరో చీటింగ్‌ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అతడిపై పీడీ చట్టం నమోదు చేసే యోచనలో రాచకొండ పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. నవీన్‌తో పాటు రూమెన్, సిద్ధు, చందులను కూడా ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కిడ్నాప్‌ ఘటనపై నవీన్‌ రెడ్డి మాట్లాడుతున్న ఒక సెల్ఫీ వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ‘కిడ్నాప్‌ చేయడం తప్పేనని అంగీకరిస్తున్నా.. ఈ ఉదంతంలో మీడియా సహా ప్రజలంతా నన్ను అప్రతిష్ఠ పాల్జేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఒక మనసుకు సంబంధించిన వ్యవహారంగా సానుకూలంగా చూడాలి’ అని ఆ వీడియోల నవీన్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని