Bapatla: కోటప్పకొండకు వెళ్తుండగా బస్సు బోల్తా.. 40 మందికి తీవ్ర గాయాలు

పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకునేందుకు పల్నాడు జిల్లా కోటప్పకొండకు వెళ్తున్న బస్సు బోల్తా పడింది.

Updated : 17 Mar 2024 12:28 IST

అద్దంకి: పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకునేందుకు పల్నాడు జిల్లా కోటప్పకొండకు వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటన ఆదివారం అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, దర్శి మండలం కొర్లమడుగు గ్రామాలకు చెందిన సుమారు 60 మంది కోటప్పకొండకు ఓ స్కూలు బస్సులో వెళ్తున్నారు. బస్సు కట్టర్‌ విరిగిపోవడంతో తిమ్మాయపాలెంలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో రోడ్డుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనాల్లో అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని 108 వాహనాల్లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. బాధితులను ఒంగోలు తరలించేందుకు అద్దంకి సీఐ సి.కృష్ణయ్య, ఎస్సై నాగరాజు, పోలీసులు సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని