
Viral: నడిరోడ్డుపై కిరాతకం
ఇంటర్నెట్ డెస్క్ : బెంగళూరులో నడి రోడ్డుపై ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కబోతున్న బాధితుడిని ఆరుగురు దుండగులు కత్తులతో నరికి చంపేశారు. మృతుడిని లక్కసంద్రకు చెందిన మదన్‌గా పోలీసులు గుర్తించారు. పాత కక్షలే హత్యకు దారి తీసినట్లు వారు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.