కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారం

ఉద్యానవనంలో స్నేహితుడితో మాట్లాడుతున్న ఓ యువతిని దుండగులు బెదిరించి బలవంతంగా కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 01 Apr 2023 06:43 IST

బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసిన కీచకపర్వం

బెంగళూరు(యశ్వంతపుర), న్యూస్‌టుడే: ఉద్యానవనంలో స్నేహితుడితో మాట్లాడుతున్న ఓ యువతిని దుండగులు బెదిరించి బలవంతంగా కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులు సతీశ్‌, విజయ్‌, శ్రీధర్‌, కిరణ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు ఆఫీస్‌ బాయ్‌లు, ఓ వ్యక్తి కాల్‌సెంటర్‌ ఉద్యోగి, మరోవ్యక్తి ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి ఈ నెల 25న రాత్రి 9 గంటల సమయంలో కోరమంగల నేషనల్‌ గేమ్స్‌ పార్క్‌లో స్నేహితుడితో మాట్లాడుతూ కూర్చొంది. నిందితులు అతడిపై దాడి చేసి యువతిని బలవంతంగా లాక్కెళ్లి కారులో పడేశారు. రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము నాలుగింటి వరకు కారులో వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. తెల్లవారగానే ఆమెను ఇంటి వద్ద వదిలేసి పరారయ్యారు. నిందితులందరూ ఆ యువతికి తెలిసిన వ్యక్తులేనని పోలీసులు వెల్లడించారు. ఉద్యానవనం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని