పిడుగు పాటుకు నలుగురి మృతి
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గురువారం పిడుగుల బారిన పడి వివిధ ఘటనల్లో నలుగురు మృత్యువాతపడ్డారు.
ఆలూరు, హాలహర్వి, కోసిగి, ఉయ్యాలవాడ - న్యూస్‌టుడే: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గురువారం పిడుగుల బారిన పడి వివిధ ఘటనల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బలగోటలో వివాహ వేడుకకు వచ్చిన బంధువుల్లో కొందరు ఉక్కపోతగా ఉండటంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక్కసారిగా వర్షం మొదలై.. వారు కూర్చున్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో కర్ణాటకకు చెందిన బసవరాజ్‌గౌడ్(30), ఉత్నూరుకు చెందిన శేఖర్ గౌడ్(31) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కోసిగి మండలం వందగల్లు గ్రామానికి చెందిన రైతు మాలదాసరి ఈరేష్ (38) గురువారం భార్య రత్నమ్మతో కలిసి పొలం పనులకు వెళ్లారు. వర్షం పడుతోందని చెట్టు కిందకు వెళ్లగా పిడుగు పడి ఈరేష్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన భార్యను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని తుడుమలదిన్నెలో చక్రవర్తి (20) అనే యువకుడిపై పిడుగు పడటంతో కన్నుమూశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఒక్క రైతును చూసినా వణుకే!
-
Covid: భవిష్యత్తులో కరోనాలాంటి మరో మహమ్మారి రావొచ్చు: ప్రముఖ చైనా వైరాలజిస్ట్
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్