Drugs: హైదరాబాద్‌ శివారులో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

నగర శివారు ఐడీఏ బొల్లారంలో భారీగా మాదక ద్రవ్యాలను డ్రగ్ కంట్రోల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 22 Mar 2024 12:23 IST

హైదరాబాద్‌: నగర శివారు ఐడీఏ బొల్లారంలో భారీగా మాదక ద్రవ్యాలను డ్రగ్ కంట్రోల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ తయారుచేస్తున్నట్లు సమాచారం అందడంతో పీఎస్‌ఎన్‌ మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించి 90 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల నుంచి వీటిని తయారు చేసి విదేశాలకు తరలిస్తున్న కస్తూరిరెడ్డిని అరెస్ట్‌ చేశారు. సిగరెట్‌ ప్యాకెట్లలో వాటిని పెట్టి బయటకు పంపిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు నగరంలోనూ సప్లై చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని