Viveka Murder Case: లొంగిపోయిన A1 ఎర్ర గంగిరెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. జూన్‌ 2వ తేదీ వరకు న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించింది.

Updated : 05 May 2023 15:31 IST

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. జూన్‌ 2వ తేదీ వరకు న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించింది. దీంతో ఎర్ర గంగిరెడ్డిని కాసేపట్లో చంచల్‌గూడ జైలుకు సీబీఐ అధికారులు తరలించనున్నారు. 

హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్ల కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని.. సహకరించేందుకు ప్రజలెవరూ ముందుకు రావడం లేదని సీబీఐ గతంలో ఆరోపించింది. ఆ మేరకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరింది. దీంతో ఆయన బెయిల్‌ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 5లోపు సీబీఐకి లొంగిపోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి సీబీఐ ఎదుట లొంగిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని