Kadapa: వివేకా హత్య కేసులో అప్రూవర్‌ దస్తగిరి తండ్రిపై వైకాపా దాడి

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి తండ్రిపై వైకాపా నేతలు దాడి చేశారు. శుక్రవారం రాత్రి పులివెందుల సమీపంలోని నామాలగుండు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 09 Mar 2024 12:17 IST

కడప : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి తండ్రిపై వైకాపా నేతలు దాడి చేశారు. శుక్రవారం రాత్రి పులివెందుల సమీపంలోని నామాలగుండు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శివరాత్రి జాగరణ కోసం వెళ్లిన దస్తగిరి తండ్రి షేక్‌ హాజీవలిని వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. సీఎం జగన్‌పై పోటీ చేసేంత ధైర్యం దస్తగిరికి ఉందా అంటూ దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలైన హాజీవలి పులివెందుల ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పులివెందుల పోలీసులకు దస్తగిరి తండ్రి ఫిర్యాదు చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని