logo

మహిళల హక్కుల పై ఉపాధి కూలీలకు అవగాహన

సఖీ కేంద్రం, మహిళా సాధికారత కేంద్రం అధ్వర్యంలో మంగళవారం అదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకొలి, లోకారి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు సఖీ కేంద్రం అందించే సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

Updated : 23 Apr 2024 16:27 IST

ఎదులాపురం: సఖీ కేంద్రం, మహిళా సాధికారత కేంద్రం అధ్వర్యంలో మంగళవారం అదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకొలి, లోకారి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు సఖీ కేంద్రం అందించే సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా సాధికారత కేంద్రం నిర్వాహకురాలు యశోద, సఖీ కేంద్రం కేస్ వర్కర్ నాగమణి  మాట్లాడుతూ కేంద్రం అందించే ఐదు రకాల సేవలు కౌన్సెలింగ్ సేవలు, న్యాయ సహాయం, పోలీస్ సహాయం, వైద్య సేవలు, తాత్కాలిక వసతి గురించి,    గృహ హింస చట్టం, బాల్యవివాహాల చట్టం, పోక్సో చట్టం, సుకన్య సమృద్ది యోజన, మిషన్ శక్తి, భీమా యోజన పథకాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున వడదెబ్బ లక్షణాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.  అత్యవసర సమయాలలో సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ నెంబర్లు 181,100 గురించి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని