logo

గ్రంథాలయాన్ని సందర్శించిన డిగ్రీ విద్యార్థులు

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించారు.

Published : 03 May 2024 17:50 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించారు. వివిధ ఆంగ్ల పుస్తకాలు, నవలలు, పోటీ పరీక్షల పుస్తకాలను పరిశీలించారు. గ్రంథాలయంలో వస్తున్న ఆంగ్ల దిన, వార, పక్ష, మాస పత్రికల వివరాలను గ్రంథ పాలకుడు గౌరు శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. జీవితకాల సభ్యత్వం, పని వేళలు, గ్రంథాలయంలో చదువుకునే సదుపాయాలను గురించి తెలుసుకున్నారు. ఆంగ్ల విభాగం హెచ్ఓడీ దయాకర్, అధ్యాపకులు బి.ఆనందం, జి.రాజ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని