logo

ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం

జిల్లా వ్యాప్తంగా క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి.

Published : 01 May 2024 18:48 IST

అదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా వ్యాప్తంగా క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 14 ప్రాంతాల్లో ఈ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు చెప్పారు.  6 నుంచి 16 ఏళ్ల లోపు బాలబాలికలు శిక్షణ శిబిరానికి అర్హులని తెలిపారు.  లోక్ సభ ఎన్నికల నియమావళిని  అనుసరించి ఈ శిక్షణ శిబిరాలు మే 31వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 6 నుంచి 8 గంటల లోపు కొనసాగుతాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని