logo

‘అమ్మో జగన్‌ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్‌నెట్‌ ధరల పెంపు!

తెదేపా హయాంలో విశాఖ జిల్లాలో 80 వేలు వరకు ఉన్న వినియోగదారుల సంఖ్య వైకాపా ప్రభుత్వం వచ్చాక తగ్గిపోయింది. చాలా మంది కనెక్షన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.

Updated : 28 Apr 2024 08:09 IST

అనుక్షణం వైకాపా ప్రభుత్వ భజనకే ప్రాధాన్యం 
ప్యాకేజీల పేరుతో దగా

ఏపీ ఫైబర్‌నెట్‌ వినియోగదారులకు జగన్‌ సినిమా చూపించాడు. ధరలు తగ్గిస్తాను..సేవలు మరింత నాణ్యతగా అందేలా చేస్తాను అని చెప్పి మోసం చేశాడు. ప్రతిపక్షనేతగా పాదయాత్ర సమయంలో రూ.150కే అన్ని ఛానళ్లతో కేబుల్‌ ప్రసారాలు అందిస్తామని ఊదరగొట్టారు. నిజమే.. అనుకున్న ప్రజలకు ఎంత భారంమోపాడో అధికారంలోకి వచ్చాక తెలిసింది.


ప్రభుత్వం మారిన వెంటనే ప్యాకేజీ ధరలను ఇష్టానుసారంగా పెంచేశారు. గందరగోళంగా మార్చేసి వినియోగదారులను ఫైబర్‌నెట్‌ సేవలకు దూరం చేశాడు. ప్యాకేజీ తీసుకొని టీవీ పెడితే... మొత్తం జగన్‌ భజనతో కూడిన ప్రచార కార్యక్రమాలు. జగన్‌ సొంత ప్రచారానికి ప్రాధాన్యమిచ్చి సంస్థను కష్టాల్లోకి నెట్టేశారు.

ఈనాడు, విశాఖపట్నం


ఈ ప్రభుత్వంలో.:

తెదేపా హయాంలో విశాఖ జిల్లాలో 80 వేలు వరకు ఉన్న వినియోగదారుల సంఖ్య వైకాపా ప్రభుత్వం వచ్చాక తగ్గిపోయింది. చాలా మంది కనెక్షన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ధర పెంచేయడం, అన్ని రకాల టీవీ ఛానెళ్లు రాకపోవడంతో ఆ ప్యాకేజీల కొనుగోలుకు ఆసక్తి చూపకపోగా ప్రస్తుత కనెక్షన్లను రద్దు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 52 వేలు మాత్రమే ఉన్నాయి. గతంలో పూర్తిస్థాయిలో సేవలు పొందిన వినియోగదారుడి మీద ఇప్పుడు రెండింతల భారం పెరిగింది.  ఇలాంటి పరిస్థితి మారాలంటే ఈ ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వాల్సిందేనని వినియోగదారులు చెబుతున్నారు.

నాడు భారం పడకుండా..

వినియోగదారులకు వినోదాత్మక సేవలందించేందుకు గత తెదేపా ప్రభుత్వం 2015లో ఏపీ ఫైబర్‌నెట్‌ ద్వారా కేబుల్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పట్లో జిల్లాలో పెద్ద సంఖ్యలో వినియోగదారులు కనెక్షన్లు తీసుకున్నారు. వారిపై భారం పడకుండా ఒక్కోటి రూ..4,400 ఖరీదైన ట్రిపుల్‌ప్లే బాక్సులను (కేబుల్‌, అపరిమిత నెట్‌, ల్యాండ్‌లైన్‌ ఫోన్‌కు ఉపయోగపడే పరికరం) ఉచితంగా అందించింది. ఈ సేవలకు ఏడాదిన్నరపాటు రుసుం వసూలు చేయలేదు. ఆపరేటర్లు మాత్రం నిర్వహణ ఛార్జీల కింద నెలకు రూ.150 చొప్పున వసూలు చేశారు. అనంతరం ప్రతి నెలా రూ.250 చొప్పున వసూలు చేస్తూ అన్నీ టీవీ ఛానెళ్లతో పాటు అపరిమిత అంతర్జాలాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇవే సేవలను ప్రస్తుతం పొందాలంటే ప్రతి నెలా రూ.599 చెల్లించక తప్పని పరిస్థితి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని