logo

మహనీయులను స్మరించుకుందాం: జేసీ

 స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను తృణప్రాయంగా భావించిన మహనీయుల చరిత్రను నేటి తరంతో పాటు విద్యార్థులకు తెలియజేయాలని జేసీ మహేష్‌కుమార్‌ అన్నారు.

Published : 13 Aug 2022 05:43 IST


ఛాయాచిత్ర ప్రదర్శన తిలకిస్తున్న మహేష్‌కుమార్‌

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే:  స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను తృణప్రాయంగా భావించిన మహనీయుల చరిత్రను నేటి తరంతో పాటు విద్యార్థులకు తెలియజేయాలని జేసీ మహేష్‌కుమార్‌ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాల్లో భాగంగా బెల్‌ కంపెనీ ఆధ్వర్యాన ఆంధ్రా జాతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన మహనీయుల ఛాయాచిత్రాలు, సందేశాల ప్రదర్శనను శుక్రవారం ఆయన బెల్‌ కంపెనీ జీఎం ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వీరులను స్మరించుకోవడం గర్వంగా ఉందని పేర్కొంటూ అందుకు అవకాశం కల్పించిన బెల్‌ యాజమాన్యాన్ని ప్రశంసించారు. ప్రదర్శనలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ(బెల్‌) తయారుచేసే పరికరాలను ఉంచారు.  మూడు రోజుల పాటు సాగే ఈ ప్రదర్శనను విద్యార్థులు తిలకించే విధంగా ఏర్పాటు చేయాలని జేసీ జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా సుల్తానాను ఆదేశించారు. బెల్‌ అధికారులు, ఉద్యోగులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వారి త్యాగాలను వృథా కానివ్వం
మచిలీపట్నం(కోనేరుసెంటరు):  మహనీయుల త్యాగాలను వృధాకానివ్వమని నినదిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, జ్యోతిబాఫులే విజ్ఞానకేంద్రం, కృష్ణా బాలోత్సవం ఆధ్యర్యాన నగరంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల్లో 75మంది స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలతో సాగిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పవన్‌కుమార్‌, తదితరులు మాట్లాడుతూ స్వాతంత్య్ర వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా నేటికి పేద విద్యార్థులకు చదువులు అందని పరిస్థితి ఉండటం దయనీయమన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మత సామరస్యాలను పరిరక్షించుకుంటామంటూ నినాదాలు చేస్తూ కోనేరుసెంటరులో రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కీర్తి, జెపన్యా, ప్రదీప్‌, ధనుష్‌ విజ్ఞానకేంద్ర కో కన్వీనర్‌ జి.నాగయ్య, రాంబాబు, కృష్ణా బాలోత్సవం అధ్యక్షులు నరేష్‌లతో పాటు పలువురు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.


ర్యాలీలో ఎస్‌ఎఫ్‌ఐ, విజ్ఞానకేంద్రం, బాలోత్సవం నాయకులు, విద్యార్థులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని