logo

Vijayawada Traffic: విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. మళ్లింపు ఇలా..

ఈ నెల 14న అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో సీపీఐ జాతీయ మహాసభలు జరుగుతున్న సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణాటాటా తెలిపారు.

Updated : 14 Oct 2022 08:37 IST

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: ఈ నెల 14న అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో సీపీఐ జాతీయ మహాసభలు జరుగుతున్న సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణాటాటా తెలిపారు. మీసాల రాజారావు వంతెన మీదుగా జీఎస్‌రాజు రోడ్డు, ప్రభుత్వ ముద్రణాలయం కూడలి, పై వంతెన, డాబాకొట్లు సెంటరు, మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు సుమారు 25వేల మందితో ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 14న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు తెలిపారు.

* సీతన్నపేట నుంచి బుడమేరు వంతెన కూడలి వరకు ఎలాంటి వాహనాలను అనుమతించరు. 

 * ఏలూరు లాకులు నుంచి సీకేరెడ్డి రోడ్డు, జీఎస్‌రాజు రోడ్డులోకి, బుడమేరు వంతెన వైపు, ప్రభుత్వ ముద్రణాలయం వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు.

వివరాలు ఇలా...

* రైల్వేస్టేషన్‌ నుంచి అజిత్‌సింగ్‌నగర్‌ వైపు వెళ్లే వాహనాలను ఏలూరు లాకులు, అలంకార్‌ కూడలి, సాంబమూర్తిరోడ్డు, బోసుబొమ్మ కూడలి, సంగీత కళాశాల, బి.ఆర్‌.టిఎస్‌.రోడ్డు, గుణదల సెంటరు, రామవరప్పాడు రింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు మీదుగా కండ్రిక వైపు వెళ్లాలి.

* చిట్టినగర్‌ నుంచి ఎర్రకట్ట మీదుగా వచ్చే వాహనాలను కాళేశ్వరరావు మార్కెట్‌ మీదుగా వెళ్లాలి. ఎర్రకట్ట మీదుగా అజిత్‌సింగ్‌నగర్‌, నూజివీడు వైపు వెళ్లే వారు.. సీవీఆర్‌ పైవంతెన మీదుగా వై.వి.రావు ఎస్టేట్‌, పైపుల రోడ్డు మీదుగా వెళ్లాలి.

* నున్న, నూజివీడు వైపు నుంచి కండ్రిక కూడలి మీదుగా వచ్చే వాహనాలను కండ్రిక జంక్షన్‌ వద్ద మళ్లించి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, రామవరప్పాడు రింగ్‌ మీదుగా నగరంలోకి రావాలి.

* పైపుల రోడ్డు, పాయకాపురం మీదుగా వన్‌టౌన్‌ వెళ్లే ప్రయాణికులు వై.వి.రావు ఎస్టేట్‌, సీవీఆర్‌ పైవంతెన, పాల ఫ్యాక్టరీ మీదుగా వెళ్లాలి.

పార్కింగ్‌ ప్రాంతాలు ఇవే..

* ఇబ్రహీంపట్నం వైపు కార్యకర్తలను తీసుకువచ్చే బస్సులు, లారీలు గొల్లపూడి బైపాస్‌, సీవీఆర్‌ పైవంతెన, వై.వి.రావు ఎస్టేట్‌ మీదుగా ఎక్సెల్‌ ప్లాంటు రోడ్డులో నిలపాలి. కార్లు, ఆటోల్లో వచ్చే వారు ఎర్రకట్ట మీదుగా మీసాల రాజారావు వంతెన వద్ద నుంచి బి.ఆర్‌.టి.ఎస్‌. రోడ్డులో మధ్య నిలపాలి.

* గుంటూరు వైపు నుంచి వచ్చే బస్సులు, లారీలు.. వారధి మీదుగా వచ్చి బెంజిసర్కిల్‌ పైవంతెన మీదుగా రామవరప్పాడు రింగ్‌, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, కండ్రిక కూడలి, పైపులరోడ్డు మీదుగా వెళ్లి ఎక్సెల్‌ ప్లాంట్‌ రోడ్డులో నిలపాలి. కార్లు, ఆటోలను బెంజిసర్కిల్‌ పైవంతెన మీదుగా రామవరప్పాడు రింగ్‌, గుణదల మీదుగా మధురానగర్‌ జంక్షన్‌ వద్ద బి.ఆర్‌.టి.ఎస్‌.రోడ్డు మధ్యలో పార్కింగ్‌ చేసుకోవాలి.

* నూజివీడు వైపు వచ్చే వాహనాలను పైపులరోడ్డు, వాంబేకాలనీకి వెళ్లే ఎక్సెల్‌ ప్లాంట్‌ రోడ్డులో నిలపాలి. * విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లా నుంచి వచ్చే లారీలు, బస్సులను రామవరప్పాడు రింగ్‌ నుంచి కండ్రిక కూడలి, పైపుల రోడ్డు కూడలి మీదుగా ఎక్సెల్‌ ప్లాంట్‌ రోడ్డులో నిలపాలి. కార్లు, ఆటోలను రామవరప్పాడు రింగ్‌, గుణదల మీదుగా బి.ఆర్‌.టిఎస్‌. రోడ్డులో నిలపాలి.

* పోలీసులు సూచించిన మార్గంలో ప్రయాణించి, ఆయా ప్రాంతాల్లో తమ వాహనాలను నిలిపి సహకరించాలని సీపీ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని