logo

బీసీల అభ్యున్నతికి లచ్చన్న కృషి

బడుగు, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు సర్దార్‌ గౌతు లచ్చన్న అని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు.

Published : 20 Apr 2024 05:29 IST

 గౌతు చిత్ర పటానికి నివాళులర్పించిన కొనకళ్ల, కొల్లు, బండి, కూటమి నాయకులు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: బడుగు, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు సర్దార్‌ గౌతు లచ్చన్న అని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. లచ్చన్న వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ పార్లమెంట్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషిచేసిన ఆయనను నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయనతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నియోకవర్గ ఇన్‌ఛార్జ్‌ బండి రామకృష్ణలు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబాప్రసాద్‌, బత్తిన దాస్‌, మాదివాడ రాము, పాషా, శేషగిరి, గోకుల శివ, గుమ్మడి విద్యాసాగర్‌, అంజిబాబు, లంకిశెట్టి నీరజ, పద్మజ, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని