logo

కూటమి కోలాహలం.. నగరం పసుపుమయం

ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్‌ (చిన్ని) నామినేషన్‌తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది.

Published : 20 Apr 2024 05:36 IST

తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తల సందడి

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌,  న్యూస్‌టుడే : ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్‌ (చిన్ని) నామినేషన్‌తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది. ఉదయం 9 గంటలకే కనకదుర్గ గుడిలో కేశినేని చిన్ని దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నివాసంలో అల్పాహారం చేశారు. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. మైనార్టీ నాయకులు ఎం.ఎస్‌.బేగ్‌, నాగుల్‌ మీరా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, గుడివాడ తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము తదితరులు హాజరయ్యారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనాలతో కంట్రోల్‌ రూం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. శ్రేణులు కదం తొక్కడంతో.. దాదాపు రెండు గంటల సమయం పట్టింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. యునైటెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పాస్టర్లు ప్రార్థనలు చేశారు. కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అప్పికట్ల జవహర్‌ ఆధ్వర్యంలో వేలాది మంది క్రైస్తవులు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. పాస్టర్‌ కాటూరి మోజెస్‌, పాస్టర్‌ సతీష్‌, ఏసురత్నం, జాన్‌కుమార్‌, జకరయ్య తదితరులు ప్రార్థనలు చేసి చిన్ని విజయాన్ని కాంక్షించారు. మోజెస్‌ జపమాలను, జవహర్‌ ఏసుక్రీస్తు ప్రతిమను కేశినేని శివనాథ్‌కు బహూకరించారు. అక్కడి నుంచి కంట్రోల్‌ రూం మీదుగా కలెక్టరేట్‌ ప్రాంగణానికి ర్యాలీ చేరుకున్నారు.

టీఎన్‌టీయూసీ కార్యకర్తల జోష్‌

లంబాడీ మహిళల నృత్య ప్రదర్శన

జనసేన కార్యకర్త హుషారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని