logo

ఓటర్లు పెరిగారు

జిల్లాలో ఓటర్ల సంఖ్య 15.39 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 15.18 లక్షలుగా ఉంది.

Published : 28 Apr 2024 04:04 IST

జిల్లాలో జనవరి నాటికి 15.39 లక్షలు
తుది జాబితా అనంతరం 21,205 పెరుగుదల

కలెక్టరేట్‌(మచిలీపట్నం): జిల్లాలో ఓటర్ల సంఖ్య 15.39 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 15.18 లక్షలుగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఓటర్ల జాబితాపై విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. మృతుల ఓట్లు జాబితా నుంచి తొలగించకపోవడం, డబుల్‌ ఎంట్రీలు, బూత్‌ల మార్పు వంటి అంశాలపై సవరణలు కోరుతూ పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. నూతన ఓటర్ల నమోదు, అభ్యంతర పరిశీలన క్రమంలో తాజాగా సవరించిన జాబితాను విడుదల చేశారు. ఈ ఏడాది తుది జాబితాతో పోల్చుకుంటే 21,205 మంది ఓటర్లు పెరిగారు. పురుషులు 8,677 మంది, మహిళలు 12,536 మంది పెరగగా, థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 8 మంది తగ్గారు.

అదనంగా 38,422: తుది జాబితా అనంతరం 38,422 మంది ఓటర్లు జాబితాలో కొత్తగా నమోదయ్యారు. పరిశీలనలో భాగంగా తుది జాబితా నుంచి 17,217 మంది ఓటర్లను తొలగించారు. మొత్తం మీద మార్పులు, చేర్పుల అనంతరం 21,205 మంది ఓటర్లు పెరిగారు. అత్యధికంగా పెనమలూరు నియోజకవర్గ పరిధిలో 10,759 మంది, అత్యల్పంగా అవనిగడ్డలో 2,770 మంది ఓటర్లు పెరిగారు. తొలగింపుల విషయంలో అత్యధికంగా గన్నవరంలో 5,531 మంది, అత్యల్పంగా పామర్రు నియోజకవర్గంలో 1,334 ఓట్లు తొలగించారు. పెనమలూరు అవనిగడ్డ నియోజకవర్గాల్లో మూడు చొప్పున, పెనమలూరు, మచిలీపట్నం, పెడనలో ఒకరు చొప్పున థర్డ్‌ జెండర్‌ ఓట్లు తగ్గగా గుడివాడలో ఒకరు కొత్తగా నమోదయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని