logo

వీరి గోడు పట్టించుకునేదెవరు..?

నగరంలోని ఏ డివిజన్‌కు వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయి. బందరుకోట ప్రధాన డ్రెయిన్‌ గుర్రపుడెక్కతో మేట వేసుకుపోవడంతో స్థానికులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 29 Apr 2024 05:03 IST

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

నగరంలోని ఏ డివిజన్‌కు వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయి. బందరుకోట ప్రధాన డ్రెయిన్‌ గుర్రపుడెక్కతో మేట వేసుకుపోవడంతో స్థానికులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానిని తొలగించే చర్యలు తీసుకోకపోవడంతో మురుగుపారుదలకు ఆటకంగా మారింది.

  • చెమ్మనగిరిపేట శివాలయం ఎదురుగా ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ రక్షణ వలయం లేక  ప్రమాదకరంగా మారింది. పలు డివిజన్లలోనూ ఇదే సమస్య నెలకొంది. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయగా ఎక్కడెక్కడ రక్షణ వలయాలు ఏర్పాటు చేయాలో సర్వే నిర్వహించారు.  ఇప్పటివరకు ఎక్కడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.
  • బందరుకోటలో ఇంకా అనేక అంతర్గత రహదారులు అభివృద్ధికి నోచుకోకపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల పలు రహదారులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేసినా అవి పాలక పక్ష నాయకులు ఉండే ప్రాంతాలకే పరిమితం అయిపోయాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
  • 17వ డివిజన్‌ పరిధిలోని చేపల మార్కెట్‌ను మోడరన్‌ మార్కెట్‌గా అభివృద్ధి చేస్తామని పాలకులు ప్రకటించినా ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు.
  • ఖాళీస్థలాల్లో పెరిగిపోతున్న పొదలతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కుక్కల బెడద కూడా ఎక్కువగా ఉంది. వీధిదీపాలు మరమ్మతులకు గురైనా పట్టించకునేవారు లేరు.

డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

- మాదిరెడ్డి సత్యనారాయణ

డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. పూడిక సక్రమంగా తీయడం లేదు. కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తాగునీటి సరఫరాకు ఇంకా అనేక ప్రాంతాలకు పైపులైన్‌లు లేక పోవడంతో శివారు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని