logo

నీ పరుగులేవమ్మ ... కృష్ణమ్మా..

కృష్ణానది నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు లేకపోవడంతో నీటిమట్టం పడిపోతోంది.

Published : 19 May 2024 03:34 IST

కళా విహీనంగా నదీ తీరం

నాడు

హరిత హోటల్‌ వద్ద..

నేడు

కృష్ణానది నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు లేకపోవడంతో నీటిమట్టం పడిపోతోంది. దీంతో స్నానఘాట్లు  బోసిపోయి కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఎన్టీపీఎస్‌లో విద్యుత్తు ఉత్పత్తికి వీలుగా ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల మేర నీటిని నిల్వ ఉంచుతారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 7.9 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. ఫలితంగా నదీ తీరం కళావిహీనంగా మారింది. నీరు ఉన్నప్పుడు ఎలా ఉందో, ప్రస్తుతం ఎలా ఉందో ఈ చిత్రాలు చూస్తే అర్థమవుతుంది.

భవానీపురం, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని