logo

YSRCP: వైకాపా సామాజిక న్యాయం అంటే ఇదేనా?.. ఫొటో వైరల్‌

వైకాపా తిరుపతి నియోజకవర్గ సమీక్ష సమావేశంలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొంటూ విడుదలైన ఓ ఫొటో వైరల్‌ అవుతోంది.

Updated : 01 Oct 2023 10:27 IST

ఈనాడు-తిరుపతి: వైకాపా తిరుపతి నియోజకవర్గ సమీక్ష సమావేశంలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొంటూ విడుదలైన ఓ ఫొటో వైరల్‌ అవుతోంది. దక్షిణ కోస్తా జిల్లాల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో జిల్లాలోని నియోజకవర్గాలపై తిరుపతిలో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి శుక్రవారం సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితోపాటు అతని కుమారుడు డిప్యూటీ మేయర్‌ అభినయ్‌రెడ్డి స్టేజీపైన కూర్చున్నారు. ఇదే సమయంలో నగర మేయర్‌ డాక్టర్‌ శిరీష ఇతర నేతలు, కార్యకర్తలతో కలిసి కింద కూర్చున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మేయర్‌కు వైకాపా ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదీ వైకాపాలో సామాజిక న్యాయం అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని