logo

వైకాపా నేతలకు స్లిప్పులు

తిరుపతి 22వ డివిజన్‌ 266 పోలింగ్‌ కేంద్రం పరిధిలో బీఎల్వో గోపీకృష్ణ ఓటర్లకు స్లిప్‌లు పంపిణీ చేస్తూ.. ఓటరు సంతకంతోపాటు ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్నారు.

Published : 03 May 2024 04:01 IST

ఓటర్ల ఫోన్‌నంబర్ల సేకరణలో బీఎల్వోలు

ప్రలోభాలకు వ్యూహరచన

 తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: -తిరుపతి 22వ డివిజన్‌ 266 పోలింగ్‌ కేంద్రం పరిధిలో బీఎల్వో గోపీకృష్ణ ఓటర్లకు స్లిప్‌లు పంపిణీ చేస్తూ.. ఓటరు సంతకంతోపాటు ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్నారు. వీటిని ఎందుకు సేకరిస్తున్నారని డివిజన్‌ తెదేపా కార్యదర్శి విశ్వేశ్వర్‌, నాయకులు బాలయ్య, రామచంద్రారెడ్డి ప్రశ్నించడంతో  బీఎల్వో అక్కడి నుంచి తప్పుకొన్నారు.

కొర్లగుంట మారుతీనగర్‌లో రెండురోజులుగా కొందరు యువకులు సచివాలయ ఉద్యోగులమంటూ ఇంటింటికి వెళ్లి ఓటరుకార్డుందా అని అడుగుతున్నారు. ఉంటే ఫోన్‌ నంబరు చెప్పమంటున్నారు. బ్యాంకు ఖాతాకు ఈ నంబరే ఇచ్చారా.. ఓటీపీ ఈ నంబరుకే వస్తుందా.. ఆధార్‌ అనుసంధాన మైందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మీరు సచివాలయ ఉద్యోగులు కాదు కదా అని కొందరు గుర్తించి ప్రశ్నిస్తే వైసీపీ అన్న చెప్పారంటూ జారుకుంటున్నారు.

తిరుపతి నియోజకవర్గంలో అధికార పార్టీ, ఓటర్లను వివిధ రూపాల్లో ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్న తీరు కళ్లముందు కనిపిస్తున్నా.. అనైతిక వ్యూహాలు రచిస్తున్నా ఎన్నికల అధికారులకు పట్టడం లేదనే ఆరోపణలున్నాయి. రిటర్నింగ్‌ అధికారిగా నగరపాలిక కమిషనర్‌ వ్యవహరించడంతోపాటు నగరపాలిక ఉద్యోగులే ఎక్కువగా ఎన్నికల విధుల్లో ఉండటంతో వైకాపా నేతల అడ్డదారి యత్నాలను అడ్డుకునే వారే కరవయ్యారు. వార్డు సచివాలయాల్లో నగరపాలిక ఉన్నతోద్యోగుల పర్య వేక్షణలో పనిచేస్తున్నవారే బీఎల్వోలు కావడంతో వైకాపా నేతలు వీరిని  లొంగదీసుకొని.. ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారు. ఈ క్రమంలో తమ ఉద్యోగాలు ఊడతాయనే ఆందోళనలో వార్డు సచివాలయ ఉద్యోగులున్నారు.

వాస్తవానికి తిరుపతిలో దొంగ ఓట్ల నియంత్రణలో భాగంగా ఇంటిం టికి నేరుగా వెళ్లి అదే చిరునామాలో ఓటర్లు ఉంటే ఓటరు స్లిప్‌ ఇవ్వాలని, లేదంటే తిరిగి ప్పగించాలని సూచిం చారు. ఇలా దొంగ ఓటర్లను గుర్తించ వచ్చని అధికారులు భావిస్తున్నప్పటికీ బీఎల్వోలను తప్పుదోవ పట్టిస్తూ అధికార పార్టీ నేతలు ఓటరు స్లిప్‌ల పంపిణీ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములవుతుండటం తో దొంగ ఓటర్లకు అడ్డుపడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పర్యవేక్షకులు, పరిశీలకులు ఏరీ?

తిరుపతిలో ఎన్నికల సంఘా నికి సమాంతరంగా అధికార పార్టీ నేతలు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. రెండు, మూడు రోజు లుగా ఓటర్ల ఫోన్‌ నంబర్లు కొందరు ఇతర ప్రాంతాల వ్యక్తులు సేకరిస్తున్న విషయం విదితమే. ఈ వ్యవహారం ఎన్నికల అధికారుల దృష్టికెళ్లినా ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్న కు సమాధానం కరవైంది. కొం దరు స్వామిభక్తితో సహకరిస్తు న్నట్లు విమర్శలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని