logo

ఆ ఆలయం అందరికీ సెంటిమెంట్‌

ఎన్నికల్లో పలు సెంటిమెంట్లు చూస్తుంటాం. ఆ గుడిలో పూజలు చేసి.. నామపత్రాలు దాఖలు చేస్తే.. గెలుపు తథ్యమని.. ఫలానా చోట నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయం సులువుగా వరిస్తుందని నాయకులు నమ్మి ఆచరిస్తుంటారు.

Published : 23 Apr 2024 05:34 IST

పలమనేరు, న్యూస్‌టుడే: ఎన్నికల్లో పలు సెంటిమెంట్లు చూస్తుంటాం. ఆ గుడిలో పూజలు చేసి.. నామపత్రాలు దాఖలు చేస్తే.. గెలుపు తథ్యమని.. ఫలానా చోట నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయం సులువుగా వరిస్తుందని నాయకులు నమ్మి ఆచరిస్తుంటారు. పలమనేరులోనూ ఇలాంటి సెంటిమెంట్‌ ఒకటి ఎన్నికల సమయంలో కనిపిస్తుంటుంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులేవరైనా ఆ గ్రామదేవతకు మొక్కులు చెల్లించాల్సిందే. పట్టణంలోని చెరువు వద్ద వెలసిన ఓంశక్తి అమ్మవారి ఆలయం ఇందుకు ప్రసిద్ధి. పలమనేరు నుంచి వైకాపా, తెదేపా నుంచి పోటీలో ఉన్న వెంకటేగౌడ, మాజీ మంత్రి అమరనాథరెడ్డి సతీ సమేతంగా పూజలు చేసి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని