logo

‘అరాచక పాలనకు అంతం పలకాలి’

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.

Published : 24 Apr 2024 03:22 IST

ప్రచారంలో సీకేబాబు, ఆయన తనయుడు సాయి కృష్ణారెడ్డి 

చిత్తూరు(జిల్లా పంచాయతీ): ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మంగళవారం నగరంలోని 8వ డివిజన్‌ పరిధిలోని వెంగళరావుకాలనీ, శ్రీనివాసనగర్‌, రీడ్స్‌పేట, కుమార్‌ నగర్‌ కాలనీల్లో మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, ఆయన తనయుడు సీకే సాయికృష్ణారెడ్డి ప్రచారం చేశారు. సైకిల్‌ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా గురజాల జగన్మోహన్‌ను, ఎంపీగా దగ్గుమళ్ల ప్రసాదరావును గెలిపించాలని కోరారు. 27వ డివిజన్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్‌ సతీమణి ప్రతిమ తెలుగు మహిళలతో కలిసి ప్రచారం చేశారు.నాయకులు త్యాగరాజన్‌, శ్రీరాములు, వైవీ రాజేశ్వరి, ప్రియాంక, జ్యోతిరాజ్‌, అనిల్‌, డేవిడ్‌, మురళి, సురేష్‌ పాల్గొన్నారు. చిత్తూరు (సంతపేట): మైనార్టీల సంక్షేమానికి ఎన్డీయే కూటమి కట్టుబడి ఉందని తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి అభ్యర్థి జగన్మోహన్‌ అన్నారు. స్థానిక భాజపా కార్యాలయంలో జరిగిన ముస్లిం మైనారిటీ మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగదీశ్వరనాయుడు, శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరచౌదరి, షంషీర్‌, రెడ్డిమస్తాన్‌ పాల్గొన్నారు. పుత్తూరు: తెదేపా గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ పేర్కొన్నారు. 12 వార్డులోని చిన్నబ్బనాయుడు కండ్రిగ, కుందిమాకులగుంట తదితర గ్రామాల్లో పర్యటించారు. పట్టణ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవరత్నం, ధనపాల్‌, మాజీ కౌన్సిలర్‌ నాగయ్య, తెదేపా నాయకులు బాబునాయుడు, రమేష్‌నాయుడు, రవి పాల్గొన్నారు. వడమాలపేట: అభ్యర్థి భానుప్రకాష్‌ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి ధనంజేయులునాయుడు అన్నారు. సీతారామపురం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. జానా వెంకటయ్య, హేమావతి, లక్ష్మీప్రసన్న, శోభనాద్రి యాదవ్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని