logo

ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం

పట్టణంలోని  ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్‌ ప్రేమకుమార్‌, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది.

Updated : 24 Apr 2024 04:47 IST

 కిడ్నీ వ్యాధితో వైద్యశాలలో చికిత్స 
 ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు

జెస్సీక (పాతచిత్రం)

పుంగనూరు గ్రామీణ: పట్టణంలోని  ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్‌ ప్రేమకుమార్‌, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. చిత్తూరు, తిరుపతి వైద్యశాలలో పరీక్షించి కిడ్నీ వ్యాధిగా తేల్చారు. స్థానికంగా చాలా వైద్యశాలల్లో తిప్పినా ప్రయోజనం లేకపోవడంతో విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ శస్త్రచికిత్స చేసి ఓ కిడ్నీ తొలగించారు. దాదాపు 15 రోజుల నుంచి ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే తల్లిదండ్రులు రూ.10 లక్షలు ఖర్చు చేశారు. ఆమె కోలుకునే వరకు మరో రూ.7 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికే అప్పు చేసి నగదు తీసుకువచ్చామని, దాతలు సాయం చేయాలని వారు మంగళవారం పుంగనూరులో వేడుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని