logo

ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్‌ అధికారి షన్మోహన్‌కు..  అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్‌), రమేష్‌ (ఆలిండియా మహిళా ఎంపవర్‌మెంట్‌ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), జయకర్‌(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు.

Published : 24 Apr 2024 03:36 IST

ఆర్వో షన్మోహన్‌కు నామపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి జగపతి ‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్‌ అధికారి షన్మోహన్‌కు..  అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్‌), రమేష్‌ (ఆలిండియా మహిళా ఎంపవర్‌మెంట్‌ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), జయకర్‌(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. నగరి, కుప్పంలో 5, జీడీనెల్లూరు, పలమనేరుల్లో 3, పూతలపట్టులో 2, చిత్తూరు, పుంగనూరుల్లో ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల సమర్పణకు ఈ నెల 25న ఆఖరు కావడంతో మరిన్ని నామపత్రాలు సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

పెనుమూరు: ఆర్వోకు నామినేషన్‌ పత్రాన్ని అందజేస్తున్న జీడీనెల్లూరు కాంగ్రెసు అభ్యర్థి రమేష్‌

కాంగ్రెస్‌ చిత్తూరు ఎంపీ అభ్యర్థి
ఆస్తుల వివరాలు
 
నియోజకవర్గం: చిత్తూరు లోక్‌సభ
అభ్యర్థి: ఎం.జగపతి
విద్యార్హతలు: డిప్లొమో ఇన్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌
చరాస్తి విలువ:  రూ.16,88,500
భార్య సుజాత చరాస్తి విలువ: రూ.11 లక్షలు
కేసులు: లేవు

న్యూస్‌టుడే, చిత్తూరు కలెక్టరేట్‌


నగరి- కాంగ్రెస్‌ అభ్యర్థి రాకేష్‌రెడ్డి ఆస్తుల వివరాలు

అభ్యర్థి: రాకేష్‌రెడ్డి నియోజకవర్గం: నగరి అసెంబ్లీ విద్యార్హత: ఎంబీఏ
ఆయన పేరిట చరాస్తులు: రూ.4,08,38,850 స్థిరాస్తులు: రూ.7,64,94,850
బంగారం: 175 గ్రాములు, విలువ రూ.10.60లక్షలు.
ఆయన భార్య పేరిట చరాస్తులు: రూ.4,46,1205 స్థిరాస్తులు: రూ.1,65,90,562
బంగారం: 690 గ్రాములు, విలువ రూ.41,81,400
భార్య పేరిట ఒక కారు విలువ : 1.60లక్షలు

న్యూస్‌టుడే, పుత్తూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని