logo

‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’

సీఎం జగన్‌ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.

Published : 24 Apr 2024 03:50 IST

మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజు, చిత్రంలో పులివర్తి నాని

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: సీఎం జగన్‌ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. మంగళవారం తిరుపతిలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా భీమవరంలో సీఎం  సిద్ధం సభలు జనాలులేక వెలవెలబోయాయని, బయటి ప్రాంతాల నుంచి 978 బస్సుల్లో తరలించినా ఒక్కో బస్సులో కనీసం పదిమంది లేరన్నారు. ఉభయ గోదావరి జిల్లా ప్రజల్లో మార్పు కనిపించిందని.. ఇప్పటికే రాయలసీమలోని రెండు జిల్లాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని.. రానున్న 20 రోజుల్లో మిగిలిన జిల్లాల్లోనూ వస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఎన్‌డీయే కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని, చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపడతారన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని... వాటిని గాడిలో పెట్టడం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. సీఎస్‌, డీజీపీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని.. రెండుమూడు రోజుల్లో వారిపై చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని