logo

అయ్యా.. ఐదేళ్లూ చాలలేదా..?

ఒక ప్రాంత అభివృద్ధికి రహదారులు, అద్భుతమైన కట్టడాలే కొలమానం. అలాంటిది చిత్తూరు నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు నానా కష్టాలు పడుతున్నారు.

Published : 29 Apr 2024 03:18 IST

 ఒక్క రోడ్డేస్తే ఒట్టు
ప్రజలకు తప్పని అవస్థలు
 నిద్రపోయిన వైకాపా సర్కార్‌

కోడిగుంట ఇందిరమ్మ కాలనీలో రోడ్డు దుస్థితి

 న్యూస్‌టుడే, చిత్తూరు నగరం : ఒక ప్రాంత అభివృద్ధికి రహదారులు, అద్భుతమైన కట్టడాలే కొలమానం. అలాంటిది చిత్తూరు నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు నానా కష్టాలు పడుతున్నారు. తారు రోడ్ల మధ్య గుంతలు, కంకర లేచిన రహదారుల్లో ప్రయాణం వాహన చోదకులకు చుక్కలు చూపుతున్నాయి. ఉదయం రద్దీ ఎక్కువగా ఉన్నవేళ ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. ఇక రాత్రివేళ గుంతలు గమనించక ద్విచక్ర వాహనదారులు కిందపడిపోతున్నారు. అసలే ఇరుకుగా ఉండే రహదారులు అందులోనూ గుంతలమయమైన ఈ దారులు నగరవాసులకు పెద్ద సమస్యగా పరిణమించాయి. ఐదేళ్ల వైకాపా పాలనలో కొత్త రోడ్ల నిర్మాణం కాదు కదా. దెబ్బతిన్న పాత రోడ్లకు మరమ్మతులు చేయలేని దుస్థితి. పైప్‌లైన్ల కోసం గుంతలు తీసి మరమ్మతు చేపట్టకుండా వదిలేయడంతో ఇవి పెద్దదిగా మారి ప్రయాణించలేని దుస్థితి. జనసంచారం ఎక్కువగా ఉండే రోడ్లకు మరమ్మతులు చేపట్టలేని స్థితిలో నగరపాలక అధికారులు ఉన్నారు. టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు.

  •  మహావీర్‌ రైల్వే వంతెనపై రోడ్డు అధ్వానంగా ఉంది. పలుమార్లు నగరపాలక, ర.భ.శాఖలు మరమ్మతులు చేపట్టినా నాణ్యత లోపం కారణంగా చిన్నపాటి వర్షాలకే తారు లేచి గుంతలమయమైంది.
  •  ప్రశాంత్‌నగర్‌, వై.ఎస్‌., ఇందిరమ్మకాలనీల్లో రోడ్డు లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ఈ కాలనీల్లో రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. వర్షాలు పడితే బురదమయమే. రెండు వేలకు పైగా కుటుంబాలు ఉన్న ఈ కాలనీల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గడపగడపకు మన ప్రభుత్వంలో స్థానికులు పలుమార్లు ప్రజాప్రతినిధులకు స్థానికులు విన్నవించినా ఫలితం శూన్యమే.
  •  పంట్రాంపల్లె, మురుకంబట్టు జీకేనగర్‌, సంతపేట సమీపంలోని మంగసముద్రం, తిమ్మసముద్రం, సాంబయ్య కండిగ తదితర పేదలు నివసించే ఇందిరమ్మ కాలనీల్లో గుంతలమయమైన, కంకర తేలిన రోడ్లే. కాలువలు, వీధి దీపాలు లేవు.

రోడ్ల నిర్మాణం చేపట్టాలి..

నగరంలోని పలు వీధుల్లో మట్టిరోడ్లు ఉన్నాయి. వీటిపై రాకపోకలకు సాగించడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు వీధులకు సంబంధించిన ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతాలు ఉన్నా కనీసం రోడ్డు నిర్మించలేదు. ఇప్పటికైనా స్పందించి రహదారి నిర్మించాలి.

-కిరణ్‌కుమార్‌, మాజీ కార్పొరేటర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని