logo

వైకాపా ప్రచారానికి అనుమతులేవీ?

వడ్డించేవాడు మనవాడైతే.. చాలన్న చందాన తిరుపతిలో వైకాపా, పోలీసుల తీరు కొనసాగుతోంది.

Updated : 30 Apr 2024 06:23 IST

నేతల వద్ద ఉన్నాయంటూ దాటవేత

పత్రాలు చూపాలని కోరుతున్న పోలీసులు

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: వడ్డించేవాడు మనవాడైతే.. చాలన్న చందాన తిరుపతిలో వైకాపా, పోలీసుల తీరు కొనసాగుతోంది. మూడురోజుల కిందట ఎన్నికల అధికారుల నుంచి అనుమతి తీసుకునిమరీ ఎన్డీయే నేతలు గిరిపురం, నెహ్రూవీధి, అనంతవీధి తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. అయితే ఇదే ప్రాంతాల్లో అనుమతులు లేకుండా అధికార పార్టీ నేతలు పోటీ ప్రచారానికి తెరతీయడం, దౌర్జన్యం చేయడం విదితమే. కొందరు కవ్వింపు చర్యలు పాల్పడి ప్రతిపక్ష కార్యకర్తలపై దాడులు చేశారు. గొడవలు జరిగి మూడురోజులు కావస్తున్నా నేటికీ కేసులు పెట్టకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రజల ముంగిట గొడవలు జరిగితే ఇంతవరకు నిందితులపై చర్యలు లేకపోవడాన్ని తప్పుబడుతున్నారు. సోమవారం వైకాపా స్థానిక నేతలు, కార్యకర్తలు 34, 35, 36 డివిజన్ల పరిధిలో అనుమతులు లేకుండానే ప్రచారం చేపట్టారు. అక్కడే ఉన్న పోలీసులు అనుమతులు ఎక్కడ అంటూ వారిని ప్రశ్నించగా కాగితాలు తమవద్ద లేవు నేతలవద్ద ఉన్నాయంటూ సమాధానం చెప్పడంతో కొంచెంసేపు పోలీసులకు వైకాపా నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు రావడంతో ప్రచార కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. అప్పటికప్పుడు అనుమతులు సర్దుబాటు చేయడం, ప్రశ్నిస్తే దాటవేయడం, ఎవరూ పట్టించుకోకుంటే ప్రచారం కొనసాగించడం వంటి ఘటనలపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని