logo

వనితే నిర్ణేత..!

సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు. జిల్లా పరిధిలో 25వ తేదీ నాటికి మొత్తం 18,12,980 ఓటర్లు ఉన్నారు.

Updated : 30 Apr 2024 06:22 IST

జిల్లా వ్యాప్తంగా 18,12,980 మంది ఓటర్లు
చంద్రగిరిలో అత్యధికంగా 3,15,159 మంది

ఈనాడు-తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు. జిల్లా పరిధిలో 25వ తేదీ నాటికి మొత్తం 18,12,980 ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహిళలు 9,29,466 ఉండగా 8,83,330 మంది పురుష ఓటర్లు రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించనున్నారు. జిల్లా పరిధిలో చంద్రగిరిలో అత్యధిక ఓటర్లు ఉండగా, అత్యల్పంగా సత్యవేడు పరిధిలో ఉన్నారు.

నెల రోజుల్లోనే..

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన మార్చి 16వ తేదీ నాటికి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో 3,12,350 మంది ఉండగా.. ఇప్పుడు 3,15,159 మందికి చేరింది. నెల వ్యవధిలోనే 2,809 మంది ఓటర్లుగా నమోదయ్యారు. తిరుపతిలోనూ పరిశీలిస్తే గత నెల వరకు 299736 మంది ఓటర్లు ఉండగా తాజాగా 302503 మంది ఉన్నారు. అంటే ఇక్కడ కూడా ఏకంగా 2767 మంది కొత్త ఓటర్లు చేరారు.

ఓట్లను చేర్చారు....

ఓటర్లను కొత్తగా చేర్చడంతోపాటు తొలగింపులు తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన తర్వాత నుంచి (జనవరి 22) ఏప్రిల్‌ 25వ తేదీ వరకు చంద్రగిరి పరిధిలో ఏకంగా 9828 మంది ఓటర్లు చేరారు. అలాగే 3585 ఓట్లను తొలగించారు. తిరుపతిలో 9821 మంది కొత్తగా జాబితాలో చేరగా 5557 మంది ఓటర్ల పేర్లను తొలగించారు.

85 ఏళ్లపైన..

జిల్లాలోని వైకాపా నేతలు 85 ఏళ్లపైన ఓటు హక్కు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,924 మంది 85 ఏళ్లపైన ఉన్నారు. ఇందులో తిరుపతిలో అత్యధికంగా 1,498 మంది, చంద్రగిరిలో 1255, వెంకటగిరిలో 1468, గూడూరులో 1395 మంది ఉన్నారు. వీరంతా ఇంటి వద్దనే తమ ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. వీరిని ప్రలోభాలకు గురి చేసేందుకు వైకాపా నేతలు ఒత్తిడి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని